T20 World Cup 2026 : భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ రద్దయితే.. ఫైనల్‌కు వెళ్లేది ఎవరు..? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి..
IND vs ENG : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా సెమీఫైనల్ పోరు దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్, భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.
- Harishth Thanniru
- Published On : March 3, 2026 / 07:19 AM IST
T20 World Cup 2026
- ఈనెల 5న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్
- మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు ఏ జట్టు వెళ్తుంది?
- ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి
IND vs ENG : టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup 2026) లో భాగంగా సెమీఫైనల్ (Semi final) పోరు 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే సెమీఫైనల్‌కు దక్షిణాఫ్రికా (south africa), భారత్ (Teamindia), ఇంగ్లాండ్ (England), న్యూజిలాండ్ (new zealand) జట్లు చేరాయి. ఈనెల 4వ తేదీన (బుధవారం) సాయంత్రం కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అదేవిధంగా ఈ నెల 5వ తేదీన (గురువారం) రెండో సెమీఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే మైదానంలో జరగనుంది. అయితే, ఒకవేళ వర్షం కారణంగా భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటి.. ఎవరు ఫైనల్‌కు వెళ్తారు.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
Also Read : T20 World Cup : మేము చేసిన పెద్ద తప్పు అదే.. అందుకే ఓడిపోయాం.. వెస్టిండీస్ కెప్టెన్ కీలక కామెంట్స్
న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా, భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే సెమీఫైనల్ పోరులో వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దయితే ఏ జట్టు ఫైనల్‌కు వెళ్తుందనే అంశం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈనెల 5న భారత్, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ వాంఖడే మైదానంలో జరగాల్సి ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. ఈ మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. ముందురోజు మ్యాచ్ జరగపోతే.. మరుసటి రోజు మ్యాచ్ నిర్వహిస్తారు. తొలిరోజు మ్యాచ్ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచే మ్యాచ్ జరుగుతుంది. రెండో రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటి..? అనే ప్రశ్న సగటు అబిమానులను వేధిస్తున్నాయి.
మ్యాచ్ రోజు, రిజర్వు డే రోజు వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. మ్యాచ్ ఫలితం తేల్చే విధానంపై ఐసీసీ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం.. నాకౌట్ దశలో మ్యాచ్ ఫలితం రాకపోతే సూపర్-8 అన్ని మ్యాచ్‌లు పూర్తయిన తరువాత సమీస్‌లో పోటీ పడిన రెండు జట్లలో మెరుగైన స్థానాల్లో ఉన్న జట్టే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ రద్దయితే ఇంగ్లాండ్ జట్టు ఫైనల్ కు చేరుతుంది. ఎందుకంటే.. గ్రూప్-2లో ఇంగ్లాండ్ టాప్ ప్లేస్‌లో ఉంది.. గ్రూప్-1లో భారత జట్టు రెండో స్థానంలో రన్నరప్ గా సెమీస్‌లోకి అడుగు పెట్టింది. దీంతో భారత జట్టు మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి వస్తుంది. ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుతుంది.
అదేవిధంగా సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ రద్దయితే.. సౌతాఫ్రికా ఫైనల్లోకి వెళ్తుంది. ఎందుకంటే.. గ్రూప్-1లో సౌతాఫ్రికా టాప్ ప్లేస్‌లో ఉంది. గ్రూప్-2లో న్యూజిలాండ్ రెండో స్థానంలో రన్నరప్‌గా ఉంది. అయితే, ఇక్కడ విషయం ఏమిటంటే.. ఈనెల 4, 5 తేదీల్లో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌ల సమయంలో వర్షం పడే అవకాశం లేదు. ఒకవేళ వర్షం పడినా మ్యాచ్ రద్దయ్యేంత వర్షం పడే అవకాశం లేదు.
