T20 World Cup 2026 IND vs ENG Team india should be over come these 5 mistakes in england match
IND vs ENG : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా గురువారం ముంబైలోని వాంఖడే వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి భారత జట్టు ఫైనల్ చేరుకోవాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు.
భారత జట్టు సెమీస్ చేరుకున్నప్పటికి కూడా ప్రతి మ్యాచ్‌లోనూ లోపాలు స్పష్టంగా కనిపించాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో కూడా ఆ లోపాలే భారత జట్టు ఓటమికి కారణం అయ్యాయి. వీటిని సరిదిద్దుకోకుంటే ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌లో భారత్ కు భంగపాటు తప్పదు.
ఈ మెగాటోర్నమెంట్‌లో భారత జట్టు అతి పెద్ద బలహీనత ఓపెనర్ల భాగస్వామ్యమే. ఓపెనర్లుగా వచ్చిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లు వ్యక్తిగతంగా రాణించినప్పటికి కూడా మంచి ఆరంభాన్ని అందించలేకపోతున్నారు. ఈ ఇద్దరూ ఎడమ చేతి వాటం బ్యాటర్లు కావడంతో ప్రత్యర్థులు ఆఫ్ స్పిన్ బౌలర్‌తో తొలి ఓవర్‌నే వేయిస్తూ ఫలితం రాబడుతున్నారు. ఈ క్రమంలో సంజూ శాంసన్ ను ఓపెనర్‌గా తీసుకువచ్చారు. అయినప్పటికి కూడా తొలి వికెట్ కు మంచి భాగస్వామ్యం ఇప్పటి వరకు నమోదు కాలేదు.
పవర్‌లో వికెట్లు..
దూకుడుగా ఆడాలన్న తొందరలో భారత జట్టు పవర్ ప్లేలోనే ఒకటి లేదా మూడు వికెట్లు కోల్పోతుంది. ఇలా పవర్ ప్లేలోనే మూడు నాలుగు వికెట్లు కోల్పోతే మిగిలిన వారిపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇది జట్టు స్కోరు పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాబట్టి పవర్ ప్లేలో వికెట్ ఇవ్వకుండా ఆడితే అదనపు ప్రయోజనం ఉంటుంది.
పేలవ ఫీల్డింగ్..
ఈ మెగాటోర్నీలో భారత జట్టు ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. మొత్తంగా 13 క్యాచ్‌లను భారత ఫీల్డర్లు నేలపాలు చేశారు. అన్ని జట్ల కంటే అత్యధిక క్యాలు చేజార్చిన జట్టుగా భారత్ ఈ టోర్నమెంట్‌లో కొనసాగుతోంది. మ్యాచ్‌లు గెలుస్తుండడంతో దీనిపైన ఎవ్వరి దృష్టి పడడంతో లేదు. సాధ్యమైనంత త్వరగా భారత జట్టు ఫీల్డింగ్ ను మెరుగుపరచుకోవాల్సి ఉంది.
అభిషేక్, సూర్య బ్యాట్ ఝుళిపించాల్సిందే..
అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ల ఫామ్ కూడా భారత జట్టును కలవరపెడుతోంది. వీరిద్దరు ఇప్పటి వరకు ఈ టోర్నీలో చెరొక మ్యాచ్‌లోనే సాధికారికంగా ఆడారు. చెరొక హాఫ్ సెంచరీ నమోదు చేశారు. వీరిద్దరు విఫలం అవుతుండడంతో మిగిలిన వారిపై ఒత్తిడి పడుతోంది.
పేలవ బౌలింగ్..
భారత బౌలర్లలో నిలకడ లోపించింది. ఓ మ్యాచ్‌లో అద్భుతంగా బంతులు వేసిన బౌలర్ మరో మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. ఇంకా జస్‌ప్రీత్ బుమ్రాపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. లీగ్ దశలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బాగానే బౌలింగ్ చేసిన సూపర్-8లో నిరాశపరిచాడు. అర్ష్‌దీప్ సింగ్ ప్రారంభ ఓవర్లలో స్వింగ్ రాబడుతూ బ్యాటర్లను ఒత్తిడికి గురి చేస్తున్నప్పటికి కూడా డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. హార్దిక్, అక్షర్, శివమ్ దూబెల్లలో నిలకడ లోపించింది.