×
Ad

Ishan Kishan : అలా ఎలా కొట్టావ్ ఇషాన్‌.. ఈ షాట్‌ను ఏమ‌ని పిల‌వాలో? వీడియో

ద‌క్షిణాఫ్రికాతో వార్మ‌ప్ మ్యాచ్‌లో ఇషాన్ కిష‌న్ (Ishan Kishan ) కొట్టిన ఓ సిక్స్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

T20 World Cup 2026 IND vs SA warm up match Ishan Kishan innovative shot video viral

Ishan Kishan : టీమ్ఇండియా ఆట‌గాడు ఇషాన్ కిష‌న్ ప్ర‌స్తుతం భీక‌ర ఫామ్‌లో ఉన్నాడు. న‌వీ ముంబై వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో చెల‌రేగి ఆడాడు. స‌ఫారీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతులను ఎదుర్కొన్న అత‌డు 2 ఫోర్లు, 7 సిక్స‌ర్ల సాయంతో 53 ప‌రుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో అన్రిచ్ నోర్ట్జే బౌలింగ్‌లో ఇషాన్ కిష‌న్ కొట్టిన ఓ సిక్స్‌కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అన్రిచ్ నోర్ట్జే వేసిన బౌన్స‌ర్‌ను ఇషాన్ చాలా తేలిక‌గా సిక్స్ బాదాడు.

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు టీమ్ఇండియాకు భారీ షాక్.. స్టార్ పేస‌ర్‌కు గాయం..!

అలా అని అత‌డు మ‌రీ బ‌లంగా బాద‌లేదు. బౌన్స్ అయి శ‌రీరం మీదికి దూసుకువ‌చ్చిన బంతిని కాస్త గైడ్ చేయ‌గా బంతి సిక్స్‌గా వెళ్లింది. ఆ షాట్‌కు బౌల‌ర్‌తో పాటు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఇక ఇషాన్.. షాట్ అనంత‌రం చిరున‌వ్వులు చిందించ‌గా.. ఫ్యాన్స్ మంత్ర‌ముగ్ధుల‌య్యారు. ఇదేం షాట్ అని అంటున్నారు.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 240 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో ఇషాన్ కిష‌న్ (53; 20 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స‌ర్లు), తిల‌క్ వ‌ర్మ (45; 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), అభిషేక్ శ‌ర్మ (24; 18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్య‌కుమార్ యాద‌వ్ (30; 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), హార్దిక్ పాండ్యా (30; 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) దంచికొట్టారు.

Ishan Kishan : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు ఇషాన్ కిష‌న్ కీల‌క వ్యాఖ్య‌లు.. అత‌డి బౌలింగ్‌లో ఆడ‌లేను.. న‌న్ను బాగా ఇబ్బంది ప‌ట్టే బౌల‌ర్ అత‌నొక్క‌డే..

అనంత‌రం ఐడెన్ మార్క్రామ్ (38; 19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), ర్యాన్ రికెల్టన్ (44; 21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (45నాటౌట్; 21 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స‌ర్లు) రాణించ‌న‌ప్ప‌టికి మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ద‌క్షిణాప్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 210 ప‌రుగులు సాధించింది. దీంతో భార‌త్ 30 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. భార‌త బౌల‌ర్ల‌లో అభిషేక్ శ‌ర్మ రెండు వికెట్లు తీశాడు.