Sanju Samson : మ్యాచ్ మధ్యలో బ్యాట్ మరిచిపోయిన సంజూ శాంసన్.. సంకలో పెట్టుకుని సల్లగా జారుకున్న రింకూసింగ్.. చివరికి..
టవల్‌ను రింకూ చేతికి ఇచ్చిన శాంసన్ (Sanju Samson) తన బ్యాట్‌ను తిరిగి తీసుకోవడం మరిచిపోయాడు.
- Thota Vamshi Kumar
- Updated on- March 3, 2026 / 12:08 PM IST
T20 World Cup 2026 IND vs WI Sanju Samson hilarious moment with Rinku Singh
- ఆదివారం కోల్‌కతా వేదికగా తలపడిన భారత్, వెస్టిండీస్
- మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం
- బ్యాట్ మరిచిపోయిన సంజూ శాంసన్
Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ అదరగొడుతోంది. ఆదివారం కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ను ఓడించి భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. భారత జట్టు విజయంలో ఓపెనర్ సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. 50 బంతులను ఎదుర్కొన్న అతడు 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డ్రింక్స్ బ్రేక్ సమయంలో కుల్దీప్ యాదవ్‌తో కలిసి రింకూ సింగ్ వాటర్ బాటిళ్లు, టవల్స్ పట్టుకుని మైదానంలోకి వచ్చాడు. సంజూ శాంసన్ వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో సంజూ శాంసన్ తన బ్యాట్‌ను రింకూ సింగ్‌కు ఇచ్చాడు. అతడు ఆ బ్యాట్‌ను తన కుడి చేతిలో పట్టుకున్నాడు. ఆతరువాత శాంసన్ కొంత వాటర్ తాగి టవల్‌తో చెమటను తుడుచుకున్నాడు. ఆ తరువాత టవల్‌ను రింకూ చేతికి ఇచ్చిన శాంసన్ తన బ్యాట్‌ను తిరిగి తీసుకోవడం మరిచిపోయాడు. బ్యాటింగ్ కు వెళ్లేందుకు సిద్ధం అయ్యాడు. పిచ్ వైపుగా నడుస్తున్నాడు.
Shahid Afridi : ఆఖరి ఓవర్ ఎలా వేయాలో తెలియదా.. అల్లుడి పై షాహిద్ అఫ్రిది ఫైర్.. నువ్వు అసలు..
మరోవైపు రింకూ సింగ్, కుల్దీప్‌లు మైదానం బయటకు వెళ్లేందుకు పరిగెత్తుతున్నారు. ఈ లోగా తన బ్యాట్‌ను మరిచిపోయిన విషయం గుర్తుకు వచ్చిన శాంసన్.. వెంటనే రింకూను పిలిచి బ్యాట్‌ను తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ సరదా ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో రోస్టన్ చేజ్ (40), జేసన్ హోల్డర్ (37 నాటౌట్), రోవ్‌మన్ పావెల్ (34 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా రెండు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు చెరో వికెట్ తీశారు.
196 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమ్ ఇండియా బ్యాటర్లలో సంజూ శాంసన్ (97 నాటౌట్; 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ (27) రాణించాడు. వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్, షమర్ జోసెఫ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. అకేల్ హోసిన్ ఓ వికెట్ సాధించాడు.
