T20 World Cup 2026 India A squad for warm up matches
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. అయితే.. ఈ మెగాటోర్నీ కన్నా ముందు వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ల కోసం భారత-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఆయుష్ బదోని నాయకత్వం వహించనున్నాడు.
ఇక ఈ జట్టులో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు తిలక్ వర్మకు చోటు ఇచ్చారు. నమన్ ధీర్, ప్రియాంష్ ఆర్య, రియాన్ పరాగ్ వంటి ఆటగాళ్లు సైతం ఉన్నారు. ఇండియా-ఏ జట్టు ఫిబ్రవరి 2న యూఎస్ఏతో నవీ ముంబై వేదికగా, 6న నమీబియాతో బెంగళూరు వేదికగా మ్యాచ్‌లు ఆడనుంది.
అందరి దృష్టి తిలక్ వర్మ పైనే..
శస్త్రచికిత్స కారణంగా ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పూర్తిగా కోలుకున్న అతడు వార్మప్ మ్యాచ్‌లలో లయ అందుకోని టీ20 ప్రపంచకప్‌లో పరుగుల వరద పారించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Presenting India A squad for the warm-up matches ahead of the ICC Men’s T20 World Cup 2026. India A will play two warm-up matches against USA and Namibia.
🙌Note: Tilak Varma will feature in one warm-up match before joining #TeamIndia for the #T20WorldCup pic.twitter.com/LIVpMvI6v6
— BCCI (@BCCI) February 2, 2026
ఇదిలా ఉంటే.. భారత జట్టు కూడా ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. సూర్య నేతృత్వంలోని జట్టు ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇక టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ను భారత్ ఫిబ్రవరి 7న ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో యూఎస్ఏతో తలపడనుంది.
వార్మప్ మ్యాచ్‌ల కోసం భారత-ఏ జట్టు ఇదే..
ఆయుష్ బదోని (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, అశుతోష్ శర్మ, ప్రియాంశ్ ఆర్యా, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, మనవ్ సుతార్, అశోక్ శర్మ, ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), గుర్జప్నీత్ సింగ్, విప్రాజ్ నిగమ్, రవి బిష్ణోయి, ఖలీల్ అహ్మద్, మయాంక్ యాదవ్.