×
Ad

T20 World Cup 2026: డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం

కీలక పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోర్ చేసింది.

  • Published On : February 26, 2026 / 10:33 PM IST

Pic Courtesy @ EspnCricInfo

T20 World Cup 2026: తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ దుమ్మురేపింది. జింబాబ్వే పై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకుంది టీమిండియా. చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన కీలక పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోర్ చేసింది. 257 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 72 రన్స్ తేడాతో భారత్ విక్టరీ కొట్టింది.

జింబాబ్వే జట్టులో ఓపెనర్ బెనెట్ ఒంటరి పోరాటం చేశాడు. 59 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ రజా 21 బంతుల్లో 31 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబె తలో వికెట్ పడగొట్టారు.

సెమీస్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగారు. బ్యాట్ తో విధ్వంసం సృష్టించారు. జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించారు. పరుగుల వరద పారించారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కో చేసింది. ఓపెనర్ అభిషేక్ హాఫ్ సెంచరీ అదరగొట్టాడు. 30 బంతుల్లోనే 55 రన్స్ చేశాడు. ఇషాన్ (38), సంజూ (24), సూర్య కుమార్ యాదవ్ (33) రాణించారు. చివరలో హార్దిక్ పాండ్య, తిలక్ వర్మలు మెరుపు బ్యాటింగ్ చేశారు. పాండ్యా 23 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 16 బంతుల్లోనే 44 రన్స్ చేశాడు.