India vs Namibia
India vs Namibia : టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్ నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే, ఈ మ్యాచ్‌కు భారత జట్టులో కీలక మార్పులు చోటు చోటుచేసుకోనున్నాయి. ముగ్గురు కీలక ప్లేయర్లు తుది జట్టు నుంచి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read : IND vs NAM : టీమిండియాకు గుడ్‌న్యూస్.. విధ్వంసకర బ్యాటర్ వచ్చేస్తున్నాడు.. పాకిస్థాన్‌కు దబిడిదిబిడే..
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లు క్రీజులోకి వచ్చారు. అయితే, ఆ మ్యాచ్ సమయంలో అభిషేక్ శర్మ అనారోగ్యానికి గురయ్యాడు. ఫుడ్ ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ మంగళవారం ఆస్పత్రిలో చేరాడు. బుధవారం సాయంత్రంకు అతను డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం అభిషేక్ కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇవాళ జరిగే నమీబియాతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడే అవకాశాలు లేనట్లుగా తెలుస్తోంది. అతని స్థానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి రానున్నాడు.
మరో ఓపెనర్ ఇషాన్ కిషన్‌సైతం నమీబియాతో మ్యాచ్‌లో ఆడే అవకావాలు తక్కువగానే ఉన్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ప్రాక్టీస్ సెషన్ సమయంలో జస్ర్పీత్ బుమ్రా వేసిన బంతికి ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. అతని ఎడమ కాలి బొటనవేలికి గాయమైంది. దీంతో ఇషాన్ కిషన్ కు వైద్య చికిత్సలు అందించారు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ కోలుకున్నప్పటికీ.. నమీబియాతో మ్యాచ్ సందర్భంగా తుది జట్టులో ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది.
జ్వరం కారణంగా యూఎస్ఏతో మ్యాచ్‌కు స్టార్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా దూరమయ్యాడు. అతని స్థానంలో మహ్మద్ సిరాజ్ కు తుది జట్టులో చోటు దక్కింది. ప్రస్తుతం జస్ర్పీత్ బుమ్రా అనారోగ్యం నుంచి కోలుకొని ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో ఇవాళ నమీబియాతో జరిగే మ్యాచ్ లో జస్ర్పీత్ బుమ్రా తుదిజట్టులోకి వచ్చే చాన్స్ ఉంది. అదే జరిగితే మహ్మద్ సిరాజ్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మరోవైపు.. ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు తుది జట్టుకు దూరమైతే.. సంజూ శాంసన్ తో పాటు ఓపెనింగ్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
తుది జట్టు (అంచనా):
సంజూ శాంసన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్.