×
Ad

T20 World Cup 2026 : దంచికొట్టిన బ్యాట‌ర్లు.. ప్ర‌పంచ‌క‌ప్‌లో బోణీ కొట్టిన ఐర్లాండ్.. ఒమ‌న్ పై ఘ‌న విజయం

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026 ) ఐర్లాండ్ జ‌ట్టు ఎట్ట‌కేల‌కు విజ‌యాన్ని సాధించింది.

T20 World Cup 2026 Ireland win by 96 runs against Oman

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో ఐర్లాండ్ ఎట్ట‌కేల‌కు గెలుపు బోణీ కొట్టింది. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఐర్లాండ్ శ‌నివారం కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఒమ‌న్ పై 96 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. కాగా.. ఈ టోర్నీలో ఒమ‌న్‌కు ఇది వ‌రుస‌గా మూడో ప‌రాజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 235 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. ఐర్లాండ్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (94 నాటౌట్; 51 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) తృటిలో సెంచ‌రీ మిస్ చేసుకున్నాడు.

IND vs PAK : భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌కు ముందు ఐసీసీ కీల‌క నిర్ణ‌యం.. భార‌త్‌కు భారీ అడ్వాంటేజ్!

గారెత్ డెలానీ (56; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ బాదాడు. ఆఖ‌రిలో జార్జ్ డాక్రెల్ 9 బంతుల్లో 5 సిక్స‌ర్ల సాయంతో 35 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఒమ‌న్ బౌల‌ర్ల‌లో షకీల్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు. షా ఫైసల్, ఆమిర్ కలీం లు చెరో వికెట్ సాధించారు.

అనంత‌రం 236 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఒమ‌న్ 18 ఓవ‌ర్ల‌లో 139 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఒమ‌న్ బ్యాట‌ర్ల‌లో అమీర్ కలీం (50; 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), హమ్మద్ మీర్జా (46; 37 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

IND vs PAK : వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దైతే భార‌త్, పాక్‌ల‌లో ఎవ‌రికి ఎక్కువ లాభం? త‌దుప‌రి ద‌శ‌కు వెళ్లేందుకు ఏ జ‌ట్టుకు ఎక్కువ అవ‌కాశం అంటే ?

సుఫ్యాన్ మెహమూద్ 10 ప‌రుగులు చేయ‌గా.. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. ఐర్లాండ్ బౌల‌ర్ల‌లో జాషువా లిటిల్ మూడు వికెట్లు తీశాడు. మాథ్యూ హంఫ్రీస్, బారీ మెక్‌కార్తీ లు చెరో రెండు వికెట్లు తీశారు. జార్జ్ డాక్రెల్ లు ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.