Kuldeep Yadav : నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. కుల్దీప్ యాదవ్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published On : February 18, 2026 / 10:13 AM IST
T20 World Cup 2026 Kuldeep Yadav eye on massive record ahead of IND vs NED match
Kuldeep Yadav : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా బుధవారం భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది.
ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ ఘనత యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉంది. చాహల్ 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు తీయగా.. కుల్దీప్ ప్రస్తుతం 54 టీ20ల్లో 95 వికెట్లు సాధించాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్లు వీరే..
* యుజ్వేంద్ర చాహల్ – 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు
* కుల్దీప్ యాదవ్ – 54 మ్యాచ్‌ల్లో 95 వికెట్లు
* అక్షర్ పటేల్ – 90 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు
* రవిచంద్రన్ అశ్విన్ – 65 మ్యాచ్‌ల్లో 72 వికెట్లు
* వరుణ్ చక్రవర్తి – 39 మ్యాచ్‌ల్లో 65 వికెట్లు
* రవి బిష్ణోయ్ – 44 మ్యాచ్‌ల్లో 64 వికెట్లు
100 వికెట్ల క్లబ్‌లో..
కుల్దీప్ యాదవ్ గనుక నెదర్లాండ్స్ మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొడితే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు మాత్రమే భారత్ తరుపున ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్లు తీశారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరుపున 100 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* అర్ష్‌దీప్ సింగ్ – 78 మ్యాచ్‌ల్లో 121 వికెట్లు
* జస్‌ప్రీత్ బుమ్రా – 89 మ్యాచ్‌ల్లో 110 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 132 మ్యాచ్‌ల్లో 109 వికెట్లు
