T20 World Cup 2026
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో జట్ల మధ్య మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. సెమీస్‌లో బెర్త్‌ను ఖరారు చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. గ్రూప్-2లో ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా.. తాజాగా.. న్యూజిలాండ్ జట్టు సెమీస్ అవకాశాలను మరింత పటిష్ఠం చేసుకుంది. టీ20 ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక సొంతగడ్డపై కనీసం సెమీఫైనల్లోకి అడుగు పెట్టకుండానే నిష్ర్రమించింది. తాజాగా న్యూజిలాండ్ జట్టుపై ఓడిపోయిన శ్రీలంక జట్టు సెమీస్ అవకాశాలను కోల్పోయింది.
సూపర్-8లో భాగంగా బుధవారం రాత్రి గ్రూప్-2లో న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా.. ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (26 బంతుల్లో 47), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 32), కోల్ మెక్‌కోన్‌కీ(23బంతుల్లో 31 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
ఆ తరువాత భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకిదిగిన శ్రీలంక బ్యాటర్లు ప్రారంభం నుంచి వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చారు. దీంతో 20ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి శ్రీలంక జట్టు 107 పరుగులు మాత్రమే చేసింది. దీంతో న్యూజిలాండ్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది.
New Zealand have a NRR of 3.05 now. pic.twitter.com/wG4VNQiwWx
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2026
పాకిస్థాన్ కూడా ఔట్!
శ్రీలంక జట్టుపై న్యూజిలాండ్ విజయం సాధించడంతో పాకిస్థాన్ జట్టు సెమీస్ అవకాశాలు క్లిష్టతరంగా మారాయి. పాకిస్థాన్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టాలంటే.. శుక్రవారం ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఓడిపోవాలి.. అదే సమయంలో శనివారం పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ విజయాన్ని నమోదు చేయాలి. పాకిస్థాన్ రన్ రేట్ కివీస్ కంటే చాలా తక్కువగా ఉంది. పాకిస్థాన్ శ్రీలంకపై సాధారణ విజయం నమోదు చేస్తే సెమీఫైనల్లోకి వెళ్లే అవకాశాలను కోల్పోతుంది. మరోవైపు..న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ జట్టుపై ఓడిపోయినా.. పాకిస్థా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. న్యూజిలాండ్ సెమీస్‌లోకి అడుగు పెడుతోంది.
🚨 NEW ZEALAND IS CLOSE TO SEMI FINAL 🚨
– They defeated Sri Lanka and knock the home team out of the T20 World Cup ❌ pic.twitter.com/gQAPWKeBN9
— Johns. (@CricCrazyJohns) February 25, 2026