×
Ad

T20 World Cup 2026 : శ‌త‌క్కొట్టిన యువ‌రాజ్‌.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్‌..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా మంగ‌ళ‌వారం చెన్నైలోని చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా న్యూజిలాండ్, కెన‌డా జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి.

T20 World Cup 2026 NZ vs Canada New Zealand target is 174

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా మంగ‌ళ‌వారం చెన్నైలోని చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా న్యూజిలాండ్, కెన‌డా జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. యువరాజ్ సమ్రా (110; 65 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) శ‌త‌క్కొట్ట‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన కెన‌డా జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 173 ప‌రుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ జ‌ట్టు ముందు 174 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెన‌డాకు ఓపెన‌ర్లు యువ‌రాజ్ స‌మ్రా, దిల్‌ప్రీత్ బజ్వా (36; 39 బంతుల్లో 4 ఫోర్లు) లు శుభారంభాన్ని అందించారు. ఆరంభంలో క్రీజులో నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నించిన యువ‌రాజ్ ఆ త‌రువాత కివీస్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు.

T20 World Cup 2026 : శ్రీలంక జ‌ట్టు విజ‌యాల వెనుక ఆ ఇద్ద‌రు మాజీ భార‌త కోచ్‌లు..

ఎడాపెడా బౌండ‌రీల‌తో స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించాడు. మ‌రోవైపు దిల్ ప్రీత్ ఆచితూచి ఆడాడు. ప్ర‌మాద‌క‌రంగా మారిన ఈ జోడిని దిల్ ప్రీత్ ను ఔట్ చేయ‌డం ద్వారా కైల్ జేమీస‌న్ విడ‌గొట్టాడు. తొలి వికెట్‌కు యువీ, దిల్ ప్రీత్‌లు 13.6 ఓవ‌ర్ల‌లో 116 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశారు.

T20 World Cup 2026 : శ్రీలంక చేతిలో అందుకే ఓడిపోయాం.. ఇక ఐర్లాండే మాకు దిక్కు.. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ కామెంట్స్‌..

దిల్ ప్రీత్ ఔటైనా యువీ త‌గ్గ‌లేదు. 58 బంతుల్లో శ‌త‌కాన్ని అందుకున్నాడు. ఈ క్ర‌మంలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో సెంచ‌రీ చేసిన అతి పిన్న వ‌య‌స్కుడైన (19 ఏళ్ల 141 రోజులు) బ్యాట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఆఖ‌రి ఓవ‌ర్‌లో భారీ షాట్‌కు య‌త్నించి ఔట్ అయ్యాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో మాట్ హెన్రీ, కైల్ జేమీస‌న్‌, జాకబ్ డఫీ, జేమ్స్ నీషమ్ లు త‌లా వికెట్ ప‌డ‌గొట్టారు.