Representative Image (Image Credit To Original Source)
T20 World Cup 2026: క్రికెట్ అంటే కాసుల పండుగ. క్రికెటర్లపై కనక వర్షం కురుస్తుంది. ఏ టోర్నీలో అయినా ఆటగాళ్లకు ప్రైజ్ మనీ రూపంలో పెద్ద మొత్తంలోనే అమౌంట్ అందుతుంది. అటువంటి వరల్డ్ కప్ ఈవెంట్ అంటే.. మామూలు విషయం కాదు. ప్రైజ్ మనీ భారీగానే ఉంటుంది. అందులోనూ టీ20 వరల్డ్ కప్ కు ఇంకా క్రేజ్ ఎక్కువ. దీంతో ఈ ఈవెంట్ లో ప్రైజ్ మనీ కూడా పెద్ద మొత్తంలోనే ఉంటుంది.
టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టుకు ఎంత డబ్బు (ప్రైజ్ మనీ) అందుతుంది. ఓడిపోయిన జట్టుకు (రన్నరప్) ఎంత అమౌంట్ ఇస్తారు. ఈ వివరాలు తెలుసుకునేందుకు క్రికెట్ లవర్స్ ఆసక్తి చూపిస్తారు. అసలు T20 ప్రపంచ కప్ లో ఏ ఎడిషన్ లో ఎంతెంత ప్రైజ్ మనీ ఇచ్చారో తెలుసుకుందాం.. టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ ఎడిషన్ 2007లో ప్రారంభమైంది. ఆ ఎడిషన్ లో విజేతకు ఇచ్చిన ప్రైజ్ మనీ రూ.2.02 కోట్లు. ఆ తర్వాత 2009లో విన్నర్ కు రూ.3.63 కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చారు. అనంతరం 2010 వరల్డ్ కప్ లో విజేతకు ఇచ్చిన ప్రైజ్ మనీ రూ.4.57 కోట్లు. ఇలా ఏటేటా ప్రైజ్ మనీ పెరుగుతూ పోయింది.
2007 – రూ.2.02 కోట్లు
2009 – రూ.3.63 కోట్లు
2010 – రూ.4.57 కోట్లు
2012 – రూ.5.34 కోట్లు
2014 – రూ.6.71 కోట్లు
2016 – రూ.10.75 కోట్లు
2021 – రూ.12.00 కోట్లు
2022 – రూ.13.20 కోట్లు
2024 – రూ.20.42 కోట్లు
2026 – రూ.27.48 కోట్లు