T20 World Cup 2026 : వర్షం కారణంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ రద్దు.. పాకిస్థాన్ సెమీస్ చేరుకునేందుకు ఇంకా ఛాన్సుందా?
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) సూపర్-8లో తొలి మ్యాచ్ నిరాశ కలిగించింది.
- Thota Vamshi Kumar
- Published On : February 22, 2026 / 01:04 PM IST
T20 World Cup 2026 semis scenario Pakistan has still chance after match against NZ washed out
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో తొలి మ్యాచ్ నిరాశ కలిగించింది. ఒక్క బంతి పడకుండానే పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో పాక్, కివీస్ జట్లకు చెరొక పాయింట్‌ను కేటాయించారు. అయితే.. కివీస్‌తో మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలపై ఖచ్చితంగా ప్రభావం చూపనుంది.
పాకిస్థాన్ సూపర్-8లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకలతో కలిసి గ్రూప్-బిలో ఉంది. కివీస్‌తో మ్యాచ్ రద్దు కాగా.. ఆ జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 24న ఇంగ్లాండ్‌తో, 28న శ్రీలంకతో తలపడనుంది.
ఈ రెండు మ్యాచ్‌ల్లో గనుక పాక్ గెలిస్తే అప్పుడు ఆ జట్టు ఖాతాలో 5 పాయింట్లు వచ్చి చేరతాయి. దీంతో పాక్ సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా పాక్‌కు కష్టాలు తప్పవు.
అప్పుడు ఆ జట్టు ఖాతాలో మూడు పాయింట్లు వచ్చి చేరతాయి. అప్పుడు పాక్ సెమీస్ చేరాలంటే మిగిలిన జట్ల ఫలితాలపై ఆధార పడాల్సి ఉంటుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే అప్పుడు పాక్ ముఖం ఇంటి ముఖం పడుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆ జట్టు 25న శ్రీలంక, 27న ఇంగ్లాండ్‌తో తలపడాల్సి ఉంది.
