×
Ad

SL vs PAK : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక‌.. పాక్ ఫ‌స్ట్ బ్యాటింగ్.. బాబ‌ర్‌కు నో ప్లేస్‌.. 65 ప‌రుగుల తేడాతో గెలవాల్సిందే..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 సూప‌ర్‌-8లో భాగంగా ప‌ల్లెక‌లె వేదిక‌గా పాకిస్థాన్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య (SL vs PAK ) మ్యాచ్ ప్రారంభ‌మైంది.

T20 World Cup 2026 SL vs PAK Sri Lanka opt to bowl

  • శ్రీలంక వ‌ర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం
  • టాస్ గెలిచిన లంక‌
  • పాక్ ఫ‌స్ట్ బ్యాటింగ్‌

SL vs PAK : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 సూప‌ర్‌-8లో భాగంగా ప‌ల్లెక‌లె వేదిక‌గా పాకిస్థాన్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన శ్రీలంక జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్థాన్ మొద‌ట బ్యాటింగ్ చేయనుంది. సెమీస్ రేసు నుంచి లంక జ‌ట్టు ఇప్ప‌టికే నిష్ర్క‌మించింది. అయితే.. ఆఖ‌రి మ్యాచ్‌లో గెలిచి ప‌రువు ద‌క్కించుకోవాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు సెమీ ఫైన‌ల్‌లో అడుగుపెట్టాలంటే ఈ మ్యాచ్‌లో శ్రీలంక పై పాకిస్థాన్ 64 కంటే ఎక్కువ ర‌న్స్ తేడాతో విజ‌యం సాధించాల్సి ఉంది.

‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. వికెట్ చూడ‌డానికి బాగుంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్ర‌భావం ఉండొచ్చు. మా శ‌క్తి మేర‌కు ఆడేందుకు ప్ర‌య‌త్నిస్తాం. గెలిచినా, ఓడిపోయినా అభిమానుల మ‌ద్ద‌తు మ‌ర‌వ‌లేనిది. జ‌ట్టులో రెండు మార్పులు ఉన్నాయి.’ అని శ్రీలంక కెప్టెన్ దాసున్ శ‌న‌క అన్నాడు.

SL vs PAK : బాబ‌ర్ ఆజామ్‌కు ఇదే లాస్ట్ మ్యాచ్? స‌ల్మాన్ కెప్టెన్సీ గోవిందా?

‘సెమీస్ చేరుకునేందుకు గొప్ప అవ‌కాశం. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేయాలి. భారీ స్కోరు చేసి ప్ర‌త్య‌ర్థిని త‌క్కువకే నియంత్రించేందుకు ప్ర‌య‌త్నిస్తాం. కొన్నిసార్లు ఇది కఠినంగా ఉండవచ్చు, కొన్నిసార్లు సులభంగా ఉండవచ్చు. మనం ఏమి చేయాలో తెలుసుకోవడం ముఖ్యం. జ‌ట్టులో మూడు మార్పులు ఉన్నాయి.’ అని పాకిస్థాన్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా అన్నాడు.

శ్రీలంక తుది జ‌ట్టు..

పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార(వికెట్ కీప‌ర్‌), చరిత్ అసలంక, పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్‌), జనిత్ లియానాగే, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక.

T20 World Cup 2026 : అలా జ‌ర‌గ‌దు.. ఇలా జ‌ర‌గ‌దా.. ఏంది సెహ్వాగ్ నువ్వు చెప్పేది.. పాక్ ఇజ్జ‌త్ ఇలా తీసేసావు ఏంటి

పాకిస్థాన్ తుది జ‌ట్టు..

సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్‌), ఖవాజా నఫే, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీప‌ర్‌), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్