×
Ad

Sri Lanka Vs Pakistan: కీలక మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ ఫర్హాన్ సెంచరీ.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే

సెమీస్ రేసు నుంచి లంక జ‌ట్టు ఇప్ప‌టికే నిష్ర్క‌మించింది. అయితే ఆఖ‌రి మ్యాచ్‌లో గెలిచి ప‌రువు ద‌క్కించుకోవాల‌ని భావిస్తోంది.

  • Published On : February 28, 2026 / 08:52 PM IST

Pic Courtesy @ EspnCricInfo

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 సూప‌ర్‌-8లో భాగంగా ప‌ల్లెక‌లె వేదిక‌గా శ్రీలంక, పాకిస్తాన్ జ‌ట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. కీలక మ్యాచ్ లో పాక్ చెలరేగింది. భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శ్రీలంక టార్గెట్ 213 పరుగులు. పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ సెంచరీతో చెలరేగాడు. 59 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. సెంచరీ చేసిన వెంటనే ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. పాక్ మరో ఓపెనర్ ఫకర్ జమాన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 42 బంతుల్లోనే 84 రన్స్ చేశాడు. 4 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు.

లంక బౌలర్లలో మధుశంక 3 వికెట్లు తీశాడు. శనక 2 వికెట్లు పడగొట్టాడు. చమీర ఒక వికెట్ తీసుకున్నాడు. సెమీస్ రేసు నుంచి లంక జ‌ట్టు ఇప్ప‌టికే నిష్ర్క‌మించింది. అయితే, ఆఖ‌రి మ్యాచ్‌లో గెలిచి ప‌రువు ద‌క్కించుకోవాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు సెమీ ఫైన‌ల్‌లో అడుగుపెట్టాలంటే ఈ మ్యాచ్‌లో శ్రీలంక పై పాకిస్థాన్ 64 కంటే ఎక్కువ ర‌న్స్ తేడాతో విజ‌యం సాధించాల్సి ఉంది.