×
Ad

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సూప‌ర్‌8కి అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. ఏ గ్రూప్‌లో ఏ జ‌ట్టు ఉందంటే ? షెడ్యూల్ ఇదే..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026) సూప‌ర్‌-8కి అర్హ‌త సాధించే జ‌ట్లు ఏవో తేలిపోయాయి.

T20 World Cup 2026 Super Eight qualified team and schedule details here

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో సూప‌ర్‌-8కి అర్హ‌త సాధించే జ‌ట్లు ఏవో తేలిపోయాయి. బుధ‌వారం న‌మీబియాతో జ‌రిగిన మ్యాచ్‌లో విజ‌యం సాధించి పాకిస్థాన్ సూప‌ర్‌-8 బెర్తును ఖాయం చేసుకున్న‌ చివ‌రి జ‌ట్టుగా నిలిచింది.

సూప‌ర్‌-8కి చేరుకున్న జ‌ట్లు ఇవే..

భార‌త్‌, పాకిస్థాన్, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జ‌ట్లు సూప‌ర్-8కి అర్హ‌త సాధించాయి. ఈ 8 జ‌ట్ల‌ను నాలుగేసి చొప్పున రెండు గ్రూపులుగా
విభ‌జించారు. గ్రూప్‌-1లో భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, జింబాబ్వే జ‌ట్లు ఉండ‌గా గ్రూప్‌-2లో శ్రీలంక‌, ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌లు ఉన్నాయి.

Uttar Pradesh : క్రికెట్‌లో విషాదం.. తేనెటీగల దాడిలో అంపైర్ మృతి.. మ్యాచ్ జ‌రుగుతుండ‌గానే..

ఫిబ్ర‌వ‌రి 21 నుంచి సూప‌ర్‌-8 ద‌శ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌కు కొలంబోని ఆర్ ప్రేమ‌దాస స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఇక భార‌త జ‌ట్టు ఫిబ్ర‌వ‌రి 22న అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నుంది.

సూప‌ర్‌-8 ద‌శ‌లో గ్రూప్‌ల‌లో ఒక్కొ జ‌ట్టు మిగిలిన జ‌ట్ల‌తో ఒక్కొ మ్యాచ్ ఆడ‌నుంది. ఆ త‌రువాత గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. సెమీస్‌లో విజ‌యం సాధించిన జ‌ట్లు ఫైన‌ల్ ఆడ‌నున్నాయి

T20 World Cup 2028 : టీ20 ప్ర‌పంచ‌ప్ 2028కి నేరుగా అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. ప్ర‌క‌టించిన ఐసీసీ

సూప‌ర్‌-8 షెడ్యూల్ ఇదే..

* ఫిబ్రవరి 21న‌ – న్యూజిలాండ్ vs పాకిస్తాన్ – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
* ఫిబ్ర‌వ‌రి 22న – ఇంగ్లాండ్ vs శ్రీలంక – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, కాండీ
* ఫిబ్ర‌వ‌రి 22న – భార‌త్ vs దక్షిణాఫ్రికా – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
* ఫిబ్ర‌వ‌రి 23న – జింబాబ్వే vs వెస్టిండీస్ – వాంఖడే స్టేడియం, ముంబై
* ఫిబ్ర‌వ‌రి 24న – ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, కాండీ
* ఫిబ్ర‌వ‌రి 25న – న్యూజిలాండ్ vs శ్రీలంక – ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో

Abhishek Sharma : జెర్సీ కాదురా అయ్యా.. ముందు నీ మైండ్ సెట్ కాస్త మార్చుకో.. సునీల్ గ‌వాస్క‌ర్ స‌ల‌హాను ప‌ట్టించుకోవా..!

* ఫిబ్ర‌వ‌రి 26న – వెస్టిండీస్ vs దక్షిణాఫ్రికా – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
* ఫిబ్ర‌వ‌రి 26న – భార‌త్ vs జింబాబ్వే – ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై
* ఫిబ్ర‌వ‌రి 27న – ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ – ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో
* ఫిబ్ర‌వ‌రి 28న – పాకిస్తాన్ vs శ్రీలంక – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, కాండీ
* మార్చి 1న – జింబాబ్వే vs దక్షిణాఫ్రికా – అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ
* మార్చి 1న – భార‌త్ vs వెస్టిండీస్ – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా