T20 World Cup 2026 West Indies won by 9 wickets against Nepal
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఆదివారం వాంఖడే వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో సూపర్-8కి విండీస్ అర్హత సాధించింది. మరోవైపు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన నేపాల్ టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. కాగా.. గ్రూప్ స్టేజీలో నేపాల్ తమ చివరి మ్యాచ్‌ను మంగళవారం (ఫిబ్రవరి 17న) స్కాట్లాండ్‌తో ఆడనుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. నేపాల్ బ్యాటర్లలో దీపేంద్ర సింగ్ ఐరీ (59; 47 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకం బాదాడు. సోంపాల్ కామి (26 నాటౌట్; 15 బంతుల్లో 4 ఫోర్లు) రాణించాడు. వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ నాలుగు వికెట్లు తీయగా.. అకేల్ హోసేన్, మాథ్యూ ఫోర్డే, షమర్ జోసెఫ్, రోస్టన్ చేజ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఇదేం కోరికరా బాబూ.. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌కు ముందు మాజీ క్రికెటర్ వింత వ్యాఖ్యలు..
Shai Hope leads the boys into the super 8s with a commanding innings.🔥#T20WorldCup | #WIvNEP | #MaroonSpirit pic.twitter.com/ILfDAXxiOn
— Windies Cricket (@windiescricket) February 15, 2026
అనంతరం 134 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 15.2 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో షై హోప్ (61 నాటౌట్; 44 బంతుల్లో 5 ఫోర్లు), షిమ్రాన్ హెట్‌మయర్ (46 నాటౌట్ ;32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) లు మెరుపులు మెరిపించారు.