T20 World Cup 2026 : కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. వెస్టిండీస్ బ్యాటింగ్
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య కీలక మ్యాచ్ ప్రారంభమైంది.
- Thota Vamshi Kumar
- Updated on- February 26, 2026 / 02:50 PM IST
T20 World Cup 2026 WI vs SA South Africa opt to bowl
- అహ్మదాబాద్‌లో ప్రారంభమైన వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్
- టాస్ గెలిచిన సౌతాఫ్రికా
- తొలుత బ్యాటింగ్ చేయనున్న వెస్టిండీస్
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య కీలక మ్యాచ్ ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచింది. ఈ జట్టు కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే భారత్‌కు సెమీస్ చేరుకునేందుకు ఈజీ అవుతుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
‘మేము ముందుగా బౌలింగ్ చేయాలని అనుకుంటున్నాము. వికెట్ చాలా బాగుంది. ఈ వికెట్ పై మేము కొన్ని మ్యాచ్‌లు ఆడాము. ఇక్కడి పరిస్థితులపై మాకు ఓ అంచనా ఉంది. వాటిని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాము. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు.’ అని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ అన్నాడు.
‘టాస్ గెలిచి ఉంటే మేము కూడా బౌలింగ్ ఎంచుకుని ఉండేవాళ్లం. అయినా ఏం కాదు. భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడతాము. తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. అకిల్ హోసన్ స్థానంలో రోస్టన్ ఛేంజ్ జట్టులోకి వచ్చాడు. ఇది ఒక వ్యూహాత్మక నిర్ణయం మాత్రమే. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్‌లో మేము చాలా మంచి క్రికెట్ ఆడాము. ఈ మ్యాచ్‌లో కూడా దానిని కంటిన్యూ చేస్తామని ఆశిస్తున్నాము. ‘అని వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తెలిపాడు.
వెస్టిండీస్ తుది జట్టు..
బ్రాండన్ కింగ్, షాయ్ హోప్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డే, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్
దక్షిణాఫ్రికా తుది జట్టు..
ఐడెన్ మార్‌క్రమ్(కెప్టెన్), క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి.
