T20 World Cup 2026 Zimbabwe opt to bowl against Oman
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా సోమవారం కొలంబోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వే, ఒమన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఒమన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీని శుభారంభంతో ఆరంభించేది ఎవరో అన్న ఆసక్తి ఉంది.
‘మేం ముందుగా బౌలింగ్ వేస్తాము. వికెట్ చాలా బాగుంది. ఆరంభంలో పేసర్లకు సహకరించవచ్చు. జింబాబ్వే, శ్రీలంక మధ్య చాలా మంచి సంబంధం ఉంది. ఈ క్రమంలోనే మెగాటోర్నీ షెడ్యూల్ కంటే వారం ముందే ఇక్కడకు వచ్చాము. మొత్తంగా 10 నుంచి 12 రోజులు ఇక్కడ గడిపాము. పరిస్థితులకు అలవాటు పడ్డాము. మా అత్యుత్తమ ప్రదర్శనను ఇస్తాము.’ అని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా తెలిపాడు.
Zimbabwe won the toss and elected to bowl against Oman 🔥#T20WorldCup pic.twitter.com/E09wD1qKdj
— Zimbabwe Cricket (@ZimCricketv) February 9, 2026
‘పిచ్ చాలా బాగుంది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా మారే అవకాశం తక్కువగా ఉంది. ఈ మెగాటోర్నీ కోసం శ్రీలంకకు చాలా ముందుగానే వచ్చాము. రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడాము. ఇక్కడి పరిస్థితులు భిన్నంగా ఉండడంతో వాటికి అలవాటు పడేందుకు కావాల్సిన సమయం దొరికింది. అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగుతున్నాం. 160 నుంచి 165 పరుగులు చేస్తే మ్యాచ్‌ను కాపాడుకోవచ్చు.’ ఒమన్ కెప్టెన్ జతీందర్ సింగ్ తెలిపాడు.
ఒమన్ తుది జట్టు..
జతీందర్ సింగ్ (కెప్టెన్), అమీర్ కలీమ్, హమ్మద్ మీర్జా, వసీం అలీ, కరణ్ సోనావాలే, జితేన్ రామానంది, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), సుఫ్యాన్ మెహమూద్, నదీమ్ ఖాన్, షా ఫైసల్, షకీల్ అహ్మద్
Zimbabwe Playing XI against Oman.📝#T20WorldCup pic.twitter.com/9QQ7N4XNWS
— Zimbabwe Cricket (@ZimCricketv) February 9, 2026
జింబాబ్వే తుది జట్టు..
బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి, డియోన్ మైయర్స్, బ్రెండన్ టేలర్(వికెట్ కీపర్), సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ