T20 World Cup 2026 : ప్రపంచకప్‌లో ఘనంగా బోణీ కొట్టిన జింబాబ్వే.. పసికూన ఒమన్ పై ఘన విజయం..
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) జింబాబ్వే శుభారంభం చేసింది.
- Thota Vamshi Kumar
- Published On : February 9, 2026 / 05:54 PM IST
T20 World Cup 2026 Zimbabwe win by 8 wickets against Oman
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే శుభారంభం చేసింది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఘన విజయం సాధించింది. 104 పరుగుల లక్ష్యాన్ని 13.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్ (48 నాటౌట్; 36 బంతుల్లో 7 ఫోర్లు), బ్రెండన్ టేలర్ (31 రిటైర్డ్ హర్ట్; 30 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. తడివానాషే మరుమాని (21; 11 బంతుల్లో 5 ఫోర్లు) వేగంగా ఆడాడు. ఒమన్ బౌలర్లలో సుఫ్యాన్ మెహమూద్ రెండు వికెట్లు తీశాడు.
అంతక ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.5 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. ఒమన్ బ్యాటర్లలో సుఫ్యాన్ మెహమూద్ (25), వినాయక్ శుక్లా (28), నదీమ్ ఖాన్ (20) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు.
మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, బ్రాడ్ ఎవాన్స్ లు తలా మూడు వికెట్లు తీశారు. కెప్టెన్ సికిందర్ రజా ఓ వికెట్ పడగొట్టాడు.
