IPL 2024 Playoffs : బీసీసీఐకి ఈసీబీ షాక్.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం..
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులు గల జట్టు వివరాలను వెల్లడించింది.
- Thota Vamshi Kumar
- Published On : April 30, 2024 / 07:32 PM IST
T20 World Cup bound England players to miss IPL 2024 playoffs
IPL 2024 : టీ20 ప్రపంచకప్ 2024కి సమయం దగ్గర పడింది. మరో నెల రోజుల్లో ఈ పొట్టి ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులు గల జట్టు వివరాలను వెల్లడించింది. టీ20 ప్రపంచకప్‌లో బట్లర్ నేతృత్వంలోనే ఇంగ్లాండ్ బరిలోకి దిగనుంది. గాయాల కారణంగా దాదాపు ఏడాది కాలంగా ఆటకు దూరమైన జోఫ్రా ఆర్చర్ ఈ టోర్నీతోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
కాగా.. టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక అయిన ఆటగాళ్లు స్వదేశానికి రావాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పిలుపు నిచ్చింది. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్‌తో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ మే 22 నుంచి 30 మధ్య జరగనుంది.
KKR : ఢిల్లీని చిత్తు చేసిన ఆనందంలో కేకేఆర్.. భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. పేసర్ పై మ్యాచ్ నిషేదం
ఈ సిరీస్‌లో ఆడేందుకు ఐపీఎల్‌లో ఆడుతున్న ప్రపంచకప్‌కు ఎంపికైన ఆటగాళ్లు సిరీస్‌కు రెండు రోజుల ముందే రావాలని చెప్పింది. దీంతో జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో వంటి ఆటగాళ్లు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరు. ఇది ఆయా ఫ్రాంచైజీలకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు దూరమయ్యే ఆటగాళ్లు వీరే..
జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), జానీ బెయిర్‌స్టో (పంజాబ్ కింగ్స్), మోయిన్ అలీ (చెన్నై సూపర్ కింగ్స్), సామ్ కరన్ (పంజాబ్ కింగ్స్), ఫిల్ సాల్ట్ (కోల్‌కతా నైట్ రైడర్స్), లియామ్ లివింగ్‌స్టోన్ (పంజాబ్ కింగ్స్), విల్ జాక్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) రీస్ టాప్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు).
టీ20 ప్రపంచకప్‌కు ఇంగ్లాండ్ జట్టు ఇదే : జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, బెయిర్ స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హర్ట్‌లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లివింగ్ స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లే, మార్క్ వుడ్.
Team India : ఐపీఎల్ ఫామ్ ఆధారంగానే టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఎంపిక?
