Team India : ఐపీఎల్ ఫామ్ ఆధారంగానే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌?

అంద‌రూ ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురుచూసిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే భార‌త జ‌ట్టు వివ‌రాల‌ను బీసీసీఐ వెల్ల‌డించింది.

Team India : ఐపీఎల్ ఫామ్ ఆధారంగానే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌?

IPL form plays major role in T20 World Cup selection

Team India – T20 World Cup 2024 : అంద‌రూ ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురుచూసిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే భార‌త జ‌ట్టు వివ‌రాల‌ను బీసీసీఐ వెల్ల‌డించింది. 15 మంది స‌భ్యులు గ‌ల బృందానికి రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. జ‌ట్టు ఎంపికను ప‌రిశీలిస్తే ప్ర‌స్తుత ఆట‌గాళ్ల ఫామ్ ఆధారంగానే జ‌ట్టు ఎంపిక జ‌రిగిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్‌లో మెరుపులు మెరిపిస్తున్న ఆట‌గాళ్ల‌కు ప్రాధాన్యం ఇచ్చిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది.

ఉదాహార‌ణ‌కు ర‌వి బిష్ణోయ్‌, రింకూ సింగ్‌లు జ‌న‌వ‌రిలో అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో ఉన్నారు. వీరిద్ద‌రికి పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో చోటు ద‌క్క‌లేదు. గ‌తేడాది అంత‌ర్జాతీయ టీ20ల్లో అరంగ్రేటం చేసిన‌ రింకూ సింగ్ భార‌త జ‌ట్టు త‌రుపున నిల‌క‌డ‌గా రాణించాడు. న‌యా ఫినిష‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే.. ప్ర‌స్తుత ఐపీఎల్ సీజ‌న్‌లో రింకూ ప్ర‌ద‌ర్శ‌న గొప్ప‌గా ఏమీ లేదు.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. మార్క్ర‌మ్ సార‌థ్యంలో డేంజ‌రెస్‌గా సౌతాఫ్రికా..

తొమ్మిది మ్యాచులు ఆడి 123 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో అత‌డిని రిజ‌ర్వ్ ప్లేయ‌ర్‌గా ఎంపిక చేశారు. అదే స‌మయంలో ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున దుమ్ములేపుతున్న‌ దూబెకు ఛాన్స్ ఇచ్చారు. 9 మ్యాచుల్లో 172.41 స్ట్రైక్‌రేటు, 58.33 స‌గ‌టుతో 350 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో ఆడిన స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయ్‌ను అస్స‌లు ప‌ట్టించుకోలేదు. ప్ర‌స్తుత ఐపీఎల్‌లో తొమ్మిది మ్యాచులు ఆడిన అత‌డు కేవ‌లం 5 వికెట్లు మాత్ర‌మే తీశాడు. అదే స‌మ‌యంలో ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌రుపున చాహ‌ల్ మంచి ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాడు. 13 వికెట్లు తీసి ఆర్ఆర్ విజయాల్లో కీల‌క పాత్ర పోషించ‌డంతో అత‌డికి ఛాన్స్ ఇచ్చారు. కాగా.. చాహ‌ల్ గ‌తేడాది ఆగ‌స్టులో చివ‌రి సారిగా టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హించ‌డం గ‌మ‌నార్హం.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ బ‌ర్త్‌డే.. త‌ల్లి పూర్ణిమ చేసిన ప‌ని వైర‌ల్‌..

అదే విధంగా రోడ్డు ప్ర‌మాదం కార‌ణంగా దాదాపు 15 నెల‌ల‌కు ఆట‌కు దూరంగా ఉన్న రిష‌బ్ పంత్‌తో పాటు ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో గాయ‌ప‌డిన సూర్య‌కుమార్ యాద‌వ్‌లు ఐపీఎల్‌లో అల‌రిస్తుండ‌డంతో వారికి ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో చోటు ఇచ్చిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. ఈ సీజ‌న్‌లో సెంచ‌రీతో స‌త్తాచాటిన జైస్వాల్ కు ఓపెన‌ర్‌గా అవ‌కాశం ఇచ్చారు. సంజూ శాంస‌న్‌, కుల్దీప్ యాద‌వ్‌, అక్ష‌ర్ ప‌టేల్ లు ఐపీఎల్‌లో రాణిస్తున్నారు. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏమిటంటే? ఐపీఎల్‌లో కెప్టెన్‌గా, ఆల్‌రౌండ‌ర్‌గా విఫ‌లం అవుతున్న‌ప్ప‌టికీ హార్దిక్ పాండ్య పై సెల‌క్ట‌ర్లు న‌మ్మ‌కం ఉంచారు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్.
రిజర్వ్ ప్లేయర్లు.. శుభ్ మన్ గిల్, రింకూసింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ ల‌ను ఎంపిక చేశారు.