T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. మార్క్ర‌మ్ సార‌థ్యంలో డేంజ‌రెస్‌గా సౌతాఫ్రికా..

ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే త‌మ‌ జ‌ట్టు వివ‌రాల‌ను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. మార్క్ర‌మ్ సార‌థ్యంలో డేంజ‌రెస్‌గా సౌతాఫ్రికా..

Aiden Markram to lead Proteas in ICC T20 World Cup 2024

T20 World Cup : భార‌త కాల‌మానం ప్ర‌కారం జూన్ 2న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఆరంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్న ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే త‌మ‌ జ‌ట్టు వివ‌రాల‌ను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది. ఐడెన్ మార్క్ర‌మ్ సార‌థ్యంలో 15 మందితో కూడిన జ‌ట్టు స‌భ్యుల పేర్ల‌ను ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టులో క్వింట‌న్ డికాక్, అన్రిచ్ నోర్జే లు చోటు ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఇటీవ‌ల వీరిద్ద‌రిని సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ నుంచి త‌ప్పించింది.

భార‌త దేశంలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 అనంత‌రం డికాక్ వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించగా, గ‌తేడాది సెప్టెంబ‌ర్ నుంచి వెన్నునొప్పితో పేస‌ర్ నోర్జే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మెరుపులు మెరిపించిన ర్యాన్ రికెల్ట‌న్‌, ఒట్‌నీల్ బార్ట్‌మ‌న్‌లకు చోటు ఇచ్చింది. వీరిద్ద‌రు తొలిసారి జాతీయ జ‌ట్టుకు ఎంపిక అయ్యారు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ బ‌ర్త్‌డే.. త‌ల్లి పూర్ణిమ చేసిన ప‌ని వైర‌ల్‌..

సౌతాఫ్రికా టీ20 లీగులో ఎంఐ కేప్‌టౌన్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన రికెల్టన్ 530 ప‌రుగులు చేశాడు. టోర్నీ టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఇక సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్ త‌రుపున బార్ట్‌మన్ ఆడాడు. 18 వికెట్లతో సత్తా చాటి త‌న జ‌ట్టు రెండో సారి విజేత‌గా నిల‌వ‌డంలో త‌న వంతు పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్‌లో అద‌ర‌గొడుతున్న మిల్ల‌ర్‌, స్టబ్స్‌, క్లాసెన్‌లు జ‌ట్టులో భాగం అయ్యారు. అలాగే రీఎంట్రీ ఇవ్వాలనుకున్న డుప్లెసిస్‌కు నిరాశే మిగిలింది.

కాగా..పొట్టి ప్ర‌పంచ‌కప్‌లో ద‌క్షిణాప్రికా త‌న తొలి మ్యాచ్‌ను జూన్ 3న న్యూయార్ వేదిక‌గా శ్రీలంక‌తో ఆడ‌నుంది.

LSG vs MI : కీల‌క మ్యాచ్‌కు ముందు ల‌క్నోకు గుడ్‌న్యూస్‌.. హార్దిక్ సేన క‌ష్టాలు రెట్టింపు?

టీ20 ప్రపంచకప్ 2024కు ద‌క్షిణాఫ్రికా జట్టు ఇదే..

ఐడెన్‌ మార్క్రమ్‌(కెప్టెన్‌), ఒట్‌నీల్‌ బార్ట్‌మన్‌, గెరాల్డ్‌ కొయోట్జీ, క్వింటన్‌ డికాక్‌, జోర్న్‌ ఫార్చూన్‌, రీజా హెండ్రిక్స్‌, మార్కో జాన్సెన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, డేవిడ్‌ మిల్లర్‌, అన్రిచ్‌ నోర్జే, కగిసో రబడ, రియాన్‌ రికెల్టన్‌, తబ్రేజ్‌ షంసీ, ట్రిస్టన్‌ స్టబ్స్‌.
ట్రావెలింగ్ రిజర్వ్: బర్గర్, ఎంగిడి.