LSG vs MI : కీల‌క మ్యాచ్‌కు ముందు ల‌క్నోకు గుడ్‌న్యూస్‌.. హార్దిక్ సేన క‌ష్టాలు రెట్టింపు?

మంగ‌ళ‌వారం ల‌క్నోలోని ఎకానా స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌నుంది.

LSG vs MI : కీల‌క మ్యాచ్‌కు ముందు ల‌క్నోకు గుడ్‌న్యూస్‌.. హార్దిక్ సేన క‌ష్టాలు రెట్టింపు?

pic credit @ ANI

Lucknow Super Giants vs Mumbai Indians : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మ్యాచులు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. ప్లే ఆఫ్స్ చేరుకునేందుకు అన్ని జ‌ట్లు కూడా నువ్వా నేనా అన్న‌ట్లుగా పోటీ ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం ల‌క్నోలోని ఎకానా స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు ల‌క్నో జ‌ట్టుకు శుభ‌వార్త అందింది. ఈ జ‌ట్టు యువ ఫాస్ట్ బౌల‌ర్ మ‌యాంక్ యాద‌వ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు.

ఈ విష‌యాన్ని ఆ జ‌ట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్క‌ల్ వెల్ల‌డించాడు. మీడియాతో మాట్లాడుతూ అత‌డు ఈ విష‌యాన్ని చెప్పాడు. గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా 21 ఏళ్ల మ‌యాంక్ ఓ ఓవ‌ర్ బౌలింగ్ చేసిన త‌రువాత గాయంతో మైదానాన్ని వీడాడు. దీంతో అత‌డు కొన్ని మ్యాచ్‌ల‌కు దూరం అయ్యాడు.

Virender Sehwag : అశ్విన్ పై సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

‘మాయాంక్ యాదవ్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అత‌డు అన్ని ఫిట్‌నెస్ టెస్టుల్లో పాస‌య్యాడు. మాకు ఇది నిజంగా శుభ‌వార్త‌. ముంబైతో మ్యాచ్‌లో అత‌డు ఆడే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా అత‌డిని ఆడించొచ్చు.’ అని మోర్క‌ల్ చెప్పుకొచ్చాడు.

ఈ సీజ‌న్‌లో వేగ‌వంత‌మైన బౌండ‌రీ..
మయాంక్ యాద‌వ్ ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో నిల‌క‌డ‌గా 150 కి.మీ వేగంతో బంతులు వేస్తూ అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు. ఈ సీజ‌న్‌లో అత్యంత వేగ‌వంత‌మైన బంతిని వేసిన బౌల‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. బెంగ‌ళూరు పై 156.7 కి.మీ వేగంతో మ‌యాంక్ బంతిని విసిరి ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

Kaviya Maran : ‘అయ్యో భ‌గ‌వంతుడా..?’ అంటూ కావ్యా పాప రియాక్ష‌న్.. ఇలా చేస్తార‌ని అనుకోలేదు!

ముంబైకి చావో రేవో..
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే ముంబైఇండియ‌న్స్ జ‌ట్టు ల‌క్నో పై విజ‌యం సాధించాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఓడిపోతే మాత్రం ప్లే ఆఫ్స్ ఆశ‌లు సంక్లిష్టంగా మారుతాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ముంబై 9 మ్యాచులు ఆడి మూడు మ్యాచుల్లోనే గెలిచింది. ఆరు పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది. అటు ల‌క్నో జ‌ట్టు 9 మ్యాచులు ఆడ‌గా ఐదు మ్యాచుల్లో గెలిచింది. 10 పాయింట్ల తో ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో ఉంది.