Kaviya Maran : ‘అయ్యో భగవంతుడా..?’ అంటూ కావ్యా పాప రియాక్షన్.. ఇలా చేస్తారని అనుకోలేదు!
భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది.

screengrab from video posted on x by@Cricket Videos
Kaviya Maran Reaction : భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 78 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (54 బంతుల్లో 98), డారిల్ మిచెల్ (32 బంతుల్లో 52) అర్ధశతకాలతో రాణించారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.5 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ సన్‌రైజర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్ 5 మ్యాచుల్లో గెలిచింది. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం 10 పాయింట్లు ఉన్నాయి. కాగా.. చెన్నై ఇన్నింగ్స్ సందర్భంగా రుతురాజ్ గైక్వాడ్ ను రనౌట్ చేసే అవకాశాన్ని సన్‌రైజర్స్ ఆటగాళ్లు వదిలివేశారు. ఈ సందర్భంగా ఆ జట్టు సహ యజమాని కావ్యా మారన్ ఇచ్చిన రియాక్షన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Virat Kohli : 500 పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లి.. డేవిడ్ వార్నర్ రికార్డు సమం
చెన్నై ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉనాద్కత్ బౌలింగ్‌లో ఈ ఓవర్‌లోని నాలుగో బంతిని రుతురాజ్ గైక్వాడ్ షాట్ ఆడాడు. పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే.. ఫీల్డర్ బంతిని అందుకుని త్రో చేయగా కెప్టెన్ కమిన్స్ బంతిని అందుకోవడంలో విఫలం అయ్యాడు. రుతురాజ్‌ను రనౌట్ చేసే అద్భుత అవకాశం చేజారింది. ఆ సమయంలో రుతురాజ్ 97 పరుగుల వద్ద ఉన్నాడు. దీన్ని చూసిన కావ్యా పాప.. అయ్యో.. అయ్యో.. భగవంతుడా అన్నట్లుగా ఇచ్చిన రియాక్షన్స్ వైరల్‌గా మారాయి.
— Cricket Videos (@cricketvid123) April 28, 2024