IND vs ENG : వావ్.. నువ్వు తోపు గురూ.. కళ్లుచెదిరే క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన అక్షర్.. వీడియోలు వైరల్
- Harishth Thanniru
- Published On : March 6, 2026 / 06:23 AM IST
IND vs ENG Axar Patel catch
IND vs ENG : టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్‌కి దూసుకెళ్లింది. గురువారం రాత్రి ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఏడు పరుగుల తేడాతో విజయంసాధించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. అయితే, ఈ మ్యాచ్ లో భారత జట్టు ఆటగాళ్లు అద్భుత ఫీల్డింగ్ తో అదరగొట్టారు. అక్షర్ పటేల్ పట్టిన రెండు క్యాచ్‌లు టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాయి. ముఖ్యంగా బౌండరీలైన్ వద్ద అక్షర్ విన్యాసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు అక్షర్ పటేల్‌ను కొనియాడుతున్నారు.
ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమయంలో అర్ష్‌దీప్ సింగ్ వేసిన 14వ ఓవర్లో అక్షర్ పటేల్ బౌండరీ లైన్ వద్ద అద్భుత డైవ్‌తో విల్ జాక్స్‌ను ఔట్ చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ ఈ ఓవర్లో ఆఖరి బంతికి మూడు వైడ్స్ వేశాడు. నాలుగో బంతిని ఫుల్ టాస్ సంధించాడు. ఈ బంతిని క్రీజులో ఉన్న విల్ జాక్స్ భారీ షాట్ ఆడగా.. డీప్ కవర్ నుంచి పరుగెత్తుకొచ్చిన అక్షర్ పటేల్.. బౌండరీ లైన్‌పై అద్భుతంగా అందుకున్నాడు. అయితే, బౌండరీ లైన్ బయట అడుగు పడే సమయంలో.. అప్పటికే అక్షర్ పటేల్ వద్దకు వచ్చిన శివమ్ దూబే వైపు బంతిని విసిరాడు. ఆ బంతి నేరుగా వెళ్లి శివం దూబే చేతిలో పడింది. దీంతో అద్భుత క్యాచ్‌తో విల్ జాక్స్ ఔట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.
విల్ జాక్స్ క్యాచ్ రూపంలో ఔట్‌గా వెనుదిరగడంతో ఐదో వికెట్‌కు నమోదైన 77 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. అక్షర్ పటేల్ పట్టిన ఈ క్యాచ్ మ్యాచ్‌ను భారత్ వైపు మలుపు తిప్పింది. ఈ క్యాచ్‌కు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అక్షర్ పటేల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
AXAR PATEL WITH ONE OF THE CRAZIEST EFFORT EVER 🥶 pic.twitter.com/psR3TKiHpN
— Johns. (@CricCrazyJohns) March 5, 2026
