T20 World Cup : అతని వల్లే గెలిచాం.. ఆ సమయంలో చాలా టెన్షన్ పడ్డా.. వామ్మో ..! సూర్యకుమార్ యాదవ్ సంచలన కామెంట్స్..
T20 World Cup IND vs ENG Match : టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్‌కి దూసుకెళ్లింది. గురువారం రాత్రి ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది.
T20 World Cup surya kumar yadav
T20 World Cup IND vs ENG Match : టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్‌కి దూసుకెళ్లింది. గురువారం రాత్రి ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఏడు పరుగుల తేడాతో విజయసాధించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. మార్చి 8న ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది.
Also Read : Jacob Bethell: భారత్‌ను బెంబేలెత్తించిన 22ఏళ్ల కుర్రాడు.. ఎవరీ జాకబ్ బెథెల్
ఈ మ్యాచ్ లో భారత్ తొలుత బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు.. నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 246 పరుగులు మాత్రమే చేసింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌పై కీలక కామెంట్స్ చేశారు.
సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మేము బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో మంచి ప్రదర్శన చేశామని చెప్పాడు. ఇదొక నమ్మశక్యం కాని అనుభూతి. భారత్ లో ఆడుతూ ఇంతటి గొప్ప జట్టుకు నాయకత్వం వహించడం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి చేరడం చాలా ప్రత్యేకం. స్పష్టమైన అవగాహనతో సంజూశాంసన్ బ్యాటింగ్ చేశాడు. వికెట్ పడినా సరే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉందని గ్రహించి దూకుడుగా ఆడాడు. జట్టుకు సరిగ్గా అలాంటి ఇన్నింగ్సే అవసరం. గత ఏడాదికాలంగా అతను పడుతున్న కష్టానికి ఈరోజు తగిన ప్రతిఫలం దక్కిందని సూర్య అన్నారు.
ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీరును సూర్యకుమార్ యాదవ్ కొనియాడారు. ఇంగ్లాండ్ చివరి వరకు పోరాటం చేసింది. చివరి ఓవర్లలో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆ సమయంలో నా హార్ట్ రేటు ఎవరైనా చూసి ఉంటే అది ఖచ్చితంగా 160- 175 మధ్యలో ఉండేదని సూర్య అన్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్ బెతెల్ ఆటతీరు చూసి కొంత ఆందోళనకు గురయ్యాను. కానీ, జస్ర్పీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, ఇతర బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో బౌలింగ్ చేసి మ్యాచ్ ను మావైపుత తిప్పారు. బుమ్రా సామర్థ్యం ఏంటో.. ఇన్నేళ్లుగా భారత్ జట్టు కోసం అతను ఏం చేశాడో మనందరికీ తెలుసు. ఈ రోజు మళ్లీ అదే చేశాడు. బాధ్యత తీసుకొని మ్యాచ్ ను ఇంగ్లాండ్ జట్టును లాగేసుకున్నాడని బుమ్రాపై సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించారు.
మా ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్ లు అందుకున్నాడు. ఫైనల్ ముందు గొప్ప మ్యాచ్ ఆడాం. ఇదొక అద్భుతమైన సెమీ ఫైనల్, ఇప్పుడు ఫైనల్ కు వెళ్తున్నందుకు సంతోషంగా ఉందని సూర్యకుమార్ యాదవ్ చెప్పారు.
Suryakumar Yadav said “Was very nervous – heart rate would have been 160-175”. 😂🔥 pic.twitter.com/ANkBfMwaYS
— Johns. (@CricCrazyJohns) March 5, 2026
