×
Ad

T20 World Cup : 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు సారూప్యతలు ఇవే..! భార‌త్‌దే వ‌ర‌ల్డ్ క‌ప్‌..!

ఆదివారం టీ20 ప్ర‌పంచ‌కప్ 2026 ఫైన‌ల్ (T20 World Cup ) మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

T20 World Cup Indian fans made wild claims parallels with the 2011 Cricket World Cup title winning script

  • ఆదివార‌మే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ఫైన‌ల్‌
  • క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్న భార‌త్, న్యూజిలాండ్
  • వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023, తాజా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు సారూప్యతలు

T20 World Cup : ఆదివారం టీ20 ప్ర‌పంచ‌కప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్లు క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఖ‌చ్చితంగా భార‌త జ‌ట్టు గెలుపొందుతుంద‌ని కొంద‌రు అభిమానులు చెబుతున్నారు. ఇందుకు 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను ఉద‌హ‌ర‌ణ‌గా తీసుకుంటున్నారు.

2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు చాలా సారూప్య‌త‌లు ఉన్నాయ‌ని అంటున్నారు. అప్పుడు భార‌త జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ గెలుచుకుంది కాబ‌ట్టి ఇప్పుడు కూడా పొట్టి వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ముద్దాడుతుంద‌ని అంటున్నారు.

IND vs NZ : న్యూజిలాండ్ అంటే ఈ ఇద్దరికీ పూనకాలే.. బ్యాటింగ్ బీభత్సమే.. ఫైనల్లో శివమెత్తేది ఎవరో మరి.. !

2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త్, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి. అప్పుడు ధోని నేతృత్వంలో భార‌త్ బ‌రిలోకి దిగింది. అప్పుడు కూడా భార‌త్.. దక్షిణాఫ్రికా చేతిలో మాత్ర‌మే ఓడిపోయింది. ప్ర‌స్తుత జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026కు కూడా భార‌త్, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మెగాటోర్నీలో కూడా భార‌త్ సూప‌ర్‌-8లో ద‌క్షిణాప్రికా చేతిలోనే ఓడిపోయింది.

ఇక 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవ‌డంతో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు టోర్న‌మెంట్ నుంచి నిష్ర్క‌మించింది. ఇక ప్ర‌స్తుత టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లోనూ ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు కివీస్ చేతిలో సెమీస్‌లో ఓడిపోవ‌డంతోనే టోర్నీ నుంచి ఇంటి ముఖం ప‌ట్టింది.

IND vs NZ : భార‌త్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ ఫైన‌ల్ మ్యాచ్‌కు అంపైర్లు వీరే..

అప్ప‌టి ఘ‌ట‌న‌లు పున‌రావృతం అయ్యాయి కాబ‌ట్టి.. ఆదివారం జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌లో కివీస్‌ను ఓడించి భార‌త్ ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడుతుంద‌ని అంటున్నారు.

ఇదిలా ఉంటే.. 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో శ్రీలంక‌తో భార‌త్ త‌ల‌ప‌డింది. ఆ మ్యాచ్‌కు ముంబైలోని వాంఖ‌డే మైదానం ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఆదివారం న్యూజిలాండ్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు అహ్మ‌దాబాద్‌లోని మోడీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది.