Abhishek Sharma
IND vs NAM : టీ20 వరల్డ్‌కప్ -2026లో భాగంగా భారత జట్టు గురువారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో నమీబియా జట్టుతో తలపడనుంది. ఈ టోర్నీలో ఇప్పటికే యూఎస్ఏతో తొలి మ్యాచ్ ఆడిన టీమిండియా.. ఆ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇవాళ రెండో మ్యాచ్‌లో భాగంగా నమీబియాతో తలపడనుంది.
Also Read : T20 World Cup: టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో టాప్ 5 థ్రిల్లింగ్ సూపర్ ఓవర్లు ఇవే..
నమీబియాతో మ్యాచ్‌కు టీమిండియా జట్టులో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా జ్వరం నుంచి కోలుకున్నప్పటికీ.. తుది జట్టులో చేరే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. భారత జట్టు ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఉదర సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో అభిషేక్ రాబోయే రెండు మూడు మ్యాచ్‌లకు దూరమవుతాడని ప్రచారం జరుగుతుండటంతో టీమిండియా ఫ్యాన్స్ ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నమీబియాతో మ్యాచ్‌లో ఆడినాఆడకపోయినా.. ఈనెల 15న పాకిస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పాడు.
Tilak Varma provides an important update on #AbhishekSharma.
Wishing him a speedy recovery! 🙌
Watch ICC Men’s #T20WorldCup 👉 #INDvNAM | THU, 12 FEB, 6 PM pic.twitter.com/PrdmATeK6t
— Star Sports (@StarSportsIndia) February 11, 2026
నమీబియాతో మ్యాచ్ నేపథ్యంలో బుధవారం తిలక్ వర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఆరోగ్య పరిస్థితి గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. జస్ర్పీత్ బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని చెప్పిన తిలక్ వర్మ.. అభిషేక్ శర్మ కోలుకుంటున్నాడని, ప్రస్తుతం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని చెప్పాడు. గురువారం నమీబియాతో జరిగే మ్యాచ్‌లో ఆడేది లేనిది అతని ఆరోగ్య స్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారని తిలక్ వర్మ చెప్పుకొచ్చారు. తిలక్ వర్మ చెప్పిన వివరాల ప్రకారం.. నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్ శర్మ అందుబాటులో ఉండరని తెలుస్తోంది. అయితే, ఈనెల 15న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు అభిషేక్ శర్మ అందుబాటులో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
పాకిస్థాన్ వర్సెస్ భారత్ మ్యాచ్‌కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే అభిషేక్ శర్మ బ్యాటుతో మరింత రెచ్చిపోతాడు. ఈ క్రమంలో ఈనెల 15వ తేదీన జరిగే పాకిస్థాన్‌తో మ్యాచ్ నాటికి తుది జట్టులోకి అభిషేక్ వస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అదేజరిగితే పాకిస్థాన్ బౌలర్లకు దబిడిదిబిడే అంటూ సోషల్ మీడియాలో టీమిండియా ఫ్యాన్స్ హల్‌చల్ చేస్తున్నారు.