2019 ఐసీసీ వరల్డ్ కప్ కోసం భారత జట్టు సిద్ధమైంది. కొన్ని నెలలుగా చర్చలు, సమావేశాలు నిర్వహించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం ఏప్రిల్ 15న పదిహేను మంది ప్లేయర్ల జాబితాను విడుదల చేసింది.
2019 ఐసీసీ వరల్డ్ కప్ కోసం భారత జట్టు సిద్ధమైంది. కొన్ని నెలలుగా చర్చలు, సమావేశాలు నిర్వహించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం ఏప్రిల్ 15న పదిహేను మంది ప్లేయర్ల జాబితాను విడుదల చేసింది. జట్టులో విభాగాల వారీగా భారత ప్లేయర్లు ఏ మాత్రం రాణించగలరు. మనకి ఆ సత్తా ఉందా.. అనే కోణంలో విశ్లేషిస్తే..
Read Also : జట్టు నుంచి ఔట్ : రాయుడు, పంత్‌కు బీసీసీఐ షాక్
ఓపెనర్లు రాణిస్తారా:
అంతర్జాతీయ క్రికెట్‌లో నెం.1 మొనగాడిగా సత్తా చాటుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..అవసరమైతే నాలుగో స్థానంలో దిగేందుకైనా సిద్ధంగా ఉన్నాడని చెప్పుకొచ్చిన సెలక్షన్ కమిటీ చీఫ్ ఎమ్మెస్కే ప్రసాద్ కోహ్లీ.. పేరు ముందుంచి జట్టును విడుదల చేశారు. అంటే అయితే 3వ స్థానంలో అయినా లేదా ఓపెనర్‌గానైనా కోహ్లీ దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు. కోహ్లీ స్ట్రైకింగ్ విషయంలో ప్రత్యేక చర్చ అనవసరం. వరల్డ్ నెం.1 బ్యాట్స్‌మెన్ కోహ్లీ కాబట్టి.
రెగ్యూలర్ వన్డే ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లకు మరో సారి అదే స్థానంలో అవకాశమిచ్చారు. సెకండ్ ఎండ్ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌కు అవకాశమిచ్చిన కమిటీ.. వీరి స్థానంలో రాహుల్‌ను దింపేందుకు సిద్ధంగా ఉంది.
మిడిలార్డర్ ప్లేయర్ల సత్తా ఏంటి:
టాపార్డర్ ఫెయిలైతే జట్టును అందుకోవాల్సింది మిడిలార్డర్ ఆటగాళ్లే. బ్యాటింగ్‌లో మిడిలార్డర్ క్రీజులో కుదురుకోకపోతే ఇక అంతే సంగతి. ఆ స్థానంలో కీలక ఆటగాళ్లు అయిన విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ, కేదర్ జాదవ్, దినేశ్ కార్తీక్‌లను జట్టులోకి ఎంచుకోవడం బాగా కలిసొచ్చే అంశం.
వికెట్ కీపర్‌కు ప్రత్యామ్నాయంగా:
సీనియర్ వికెట్ కీపర్.. అరంగ్రేట మ్యాచ్ నుంచి ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ల వరకూ వికెట్ కీపర్‌గా ఏ మాత్రం చురుకుదనం తగ్గని మహేంద్ర సింగ్ ధోనీని వికెట్ కీపర్‌గా తీసుకోవడం ఉత్తమం. అందరూ ఊహించినట్లుగానే ధోనీకి కీపర్‌గా పగ్గాలు అందించారు.
అయితే రెండో వికెట్ కీపర్‌గా పంత్.. కార్తీక్ ఇద్దరిలో ఎవరనే అంశంలో కార్తీక్‌కే మొగ్గు చూపారు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో గేమ్ ఫినిషర్‌గా ధోనీ అడుగుజాడల్లో ఆటలో మెరుపులు కురిపిస్తున్న కార్తీక్ వికెట్ కీపర్‌గానే కాకుండా బ్యాటింగ్‌లో కూడా రాణించగలడు.
ఆల్ రౌండర్ల సంగతేంటి
ఆల్ రౌండర్ల విషయంలో బీసీసీఐ ముంగిట మెరుగైన అవకాశాలు కనిపించాయి. ఈ క్రమంలో కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను ఎంచుకుంది.
Read Also : పోటుగాళ్లు : వరల్డ్ కప్ టీమిండియా ఇదే
స్పిన్నర్ల మాయాజాలం
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో విదేశీ గడ్డలపైనా.. సత్తా చాటుతున్న యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లకు చక్కటి అవకాశాన్ని కల్పించింది సెలక్షన్ కమిటీ. మరో స్పిన్నర్‌గా జడేజాను తీసుకుని టీమిండియా లాభపడింది.
ఫేసర్ల దూకుడు:
విదేశీ గడ్డలపై సత్తా చాటి వికెట్ల వర్షం కురిపిస్తున్న మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లతో పాటు బుమ్రా కూడా టీమిండియా పదిహేను మంది ప్లేయర్ల జాబితాలో స్థానం దక్కించుకోవడం మంచి పరిణామంగా కనిపిస్తోంది.
కోహ్లీ కెప్టెన్సీ విషయంలో విఫలమవుతున్నాడని.. సరిగా సరిపోడని విమర్శకుల వాదనకు.. సమాధానంగా మహేంద్ర సింగ్ ధోనీ జట్టులో ఉన్నాడు. ఫీల్డింగ్‌లో చురుగ్గా కదిలే భారత ప్లేయర్లను సద్వినియోగం చేసుకోవడంలో ధోనీ దిట్ట. కెప్టెన్ కోహ్లీ అయినా ధోనీ గీచిన హద్దు దాటని టీమిండియా వరల్డ్ కప్ సమరంలో మంచి టఫ్ పోటీ ఇవ్వనుంది.
Read Also : జియో స్పెషల్ ఆఫర్ : IPL క్రికెట్ 4G డేటా ప్లాన్ ఇదే