IND vs WI : భార‌త్‌, వెస్టిండీస్ జ‌ట్ల‌కు ఐసీసీ బిగ్ షాక్‌.. వాళ్ల‌కు 10, మ‌న‌కు 20.. ఇదేం లెక్క‌లురా అయ్యా..

భారత్, వెస్టిండీస్ జట్లకు ఐసీసీ (IND vs WI) భారీ షాక్ ఇచ్చింది.

Team India and West Indies fined for slow over rate in 3rd ODI

IND vs WI : వెస్టిండీస్ పై వ‌న్డే సిరీస్ సాధించి మంచి జోష్‌లో ఉంది టీమ్ఇండియా. అదే స‌మ‌యంలో సిరీస్ కోల్పోయిన‌ప్ప‌టికి ఆఖ‌రి వ‌న్డేలో భారీ ల‌క్ష్యాన్ని ఛేదించిన ఉత్సాహంలో ఉంది వెస్టిండీస్‌. ఇలా రెండు జ‌ట్లు సంతోషంలో ఉండ‌గా.. అటు భార‌త్‌, ఇటు వెస్టిండీస్‌కు ఐసీసీ బిగ్ షాకిచ్చింది. రెండు జ‌ట్ల‌కు భారీ జ‌రిమానా విధించింది. ఇక్క‌డ వెస్టిండీస్ కంటే భార‌త్‌కే ఎక్కువ జ‌రిమానా ప‌డ‌డం గ‌మ‌నార్హం.

శనివారం న్యూ చండీగఢ్‌లో జరిగిన మూడో వ‌న్డే మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు స్లో ఓవ‌ర్ రేటు (నిర్ణీత స‌మ‌యానికి ఓవ‌ర్ల కోటా పూర్తి చేయ‌క‌పోవ‌డం)ను న‌మోదు చేశాయి. దీంతో వెస్టిండీస్‌కు వారి మ్యాచ్ ఫీజులో 10 శాతం అలాగే భార‌త్‌కు వారి మ్యాచ్‌లో 20 శాతం జ‌రిమానాగా విధించారు.

వెస్టిండీస్ కంటే భార‌త్‌కు ఎక్కువ ఎందుకంటే?

నిర్ణీత స‌మయానికి భార‌త్ నాలుగు ఓవ‌ర్ల‌ను త‌క్కువ‌గా వేసింది. అదే స‌మ‌యంలో వెస్టిండీస్ రెండు ఓవ‌ర్ల‌ను త‌క్కువ‌గా వేసింది. ఆటగాళ్లు, ఆటగాళ్ల సహాయక సిబ్బంది కోసం ఉద్దేశించిన ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. కనీస ఓవర్-రేట్ ఉల్లంఘనలకు సంబంధించి.. కేటాయించిన సమయంలో జట్టు బౌలింగ్ చేయడంలో విఫలమైన ప్రతి ఓవర్‌కు ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించబడుతుంది.

ఈ క్ర‌మంలో భార‌త్ నాలుగు ఓవ‌ర్ల‌ను త‌క్కువ‌గా వేయ‌డంతో 20 శాతం, వెస్టిండీస్ రెండు ఓవ‌ర్ల‌ను త‌క్కువ‌గా వేయ‌డంతో 10 శాతం జ‌రిమానాగా విధించారు. ఇక ఇరు జ‌ట్ల కెప్టెన్లు తమ త‌ప్పును, ప్రతిపాదిత శిక్షలను అంగీకరించార‌ని, అందువ‌ల్ల దీనిపై త‌దుప‌రి ఎలాంటి విచార‌ణ ఉండ‌ద‌ని ఐసీసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.