Abhishek Sharma : కివీస్‌పై ఊచకోత ఎఫెక్ట్.. మళ్లీ అగ్రస్థానంలోకి అభిషేక్ శర్మ.. నువ్వు తోపు సామీ..

Abhishek Sharma : భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి అంతర్జాతీయ క్రికెట్‌లో తన సత్తాచాటాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో మళ్లీ అగ్రస్థానంలోకి వచ్చాడు.

Abhishek Sharma

Abhishek Sharma : భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి అంతర్జాతీయ క్రికెట్‌లో తన సత్తా చాటాడు. ఐసీసీ పురుషుల టీ20 అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో విధ్వంసకర శతకం సాధించడంతో ఈ ఘనత అందుకున్నాడు.

Also Read : Shreyas Iyer : ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయ‌డం ఎంత క‌ష్ట‌మో అప్పుడే నాక‌ర్థ‌మైంది.. నిజంగా అభిషేక్, వైభ‌వ్ ఉన్నారు చూడండి.. శ్రేయ‌స్ అయ్య‌ర్ కామెంట్స్‌..

న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, మొత్తం 38 బంతుల్లో 113 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం 897 పాయింట్లతో తొలి ర్యాంకులో నిలిచాడు.

ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న ఇషాన్ కిషన్ (866) మూడో ర్యాంకుకు పడిపోయాడు. ఇక పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్‌జాద ఫర్హాన్ (883) రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఐదు స్థానాలు దిగజారి తొమ్మిదో ప్లేస్ కు చేరాడు. తిలక్ వర్మ (724) పదో ర్యాంకులో ఉన్నాడు. కివీస్ పై రానించిన సంజు శాంసన్ (632) ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని 20వ ర్యాంకులో నిలిచాడు. ఇక యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (543) కూడా తొమ్మిది స్థానాలు ముందుకొచ్చి 45వ ర్యాంకు సాధించాడు.

టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఆరు స్థానాలు ఎగబాకి 15వ స్థానాన్ని అందుకున్నాడు. ఈ విభాగంలో రషీద్ ఖాన్ (733) టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. భారత్‌ నుంచి టాప్‌-10లో ఒక్క భారత బౌలరూ లేడు. అక్షర్ పటేల్ 11వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.