IND vs JPN : చారిత్రక మ్యాచ్‌లో జపాన్ పై భారత్ విజయం.. అతి కష్టం మీద..
చారిత్రక మ్యాచ్‌లో జపాన్ పై భారత్ 2 పరుగుల తేడాతో (IND vs JPN ) విజయం సాధించింది.
- Thota Vamshi Kumar
- Updated on- September 22, 2026 / 01:47 PM IST
Team India beat japan in T20 match by 2 runs
IND vs JPN : చారిత్రక మ్యాచ్‌లో జపాన్ పై భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది.
ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. సంజూ శాంసన్ (9; 7 బంతుల్లో 1 ఫోర్), ఇషాన్ (3; 6 బంతుల్లో) విఫలం అయ్యారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16; 12 బంతుల్లో 1 ఫోర్) పర్వాలేదనిపించాడు. జపాన్ బౌలర్లలో చార్లీ హర-హింజ్ రెండు వికెట్లు తీశాడు. ఇబ్రహీం తకహషి, బెంజమిన్ ఇటో-డేవిస్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ నిర్ణీత 5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. జపాన్ బ్యాటర్లలో కెండెల్ కడోవాకి-ఫ్లెమిన్ (12) రాణించాడు. భారత బౌలర్లలో వాపింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీశాడు.
ఆఖరి ఓవర్‌లో జపాన్ విజయానికి 8 పరుగులు అవసరం అయ్యాయి. అయితే.. అక్షర్ పటేల్ చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. చివరి బంతికి నాలుగు పరుగులు అవసమైన తరుణంలో జపాన్ బ్యాటర్ ఒక్క పరుగు మాత్రమే తీయడంతో భారత్ రెండు పరుగుల తేడాతో గెలుపొందింది.
