Ajit Agarkar : నా ప‌ద‌వి కాలాన్ని పొడిగించండి.. స‌రైన టైమ్‌లో అడిగిన అగార్క‌ర్‌.. నో చెప్పే ఛాన్స్ బీసీసీఐకి లేదా?

భారత క్రికెట్ జట్టు ప్రధాన సెలెక్టర్ గా మ‌రికొంత కాలం పాటు కొన‌సాగాల‌ని అజిత్ అగార్కర్ (Ajit Agarkar) కోరుకుంటున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి

Team India chief selector Ajit Agarkar requested BCCI to extend his tenure report

Ajit Agarkar : భారత క్రికెట్ జట్టు ప్రధాన సెలెక్టర్ గా మ‌రికొంత కాలం పాటు కొన‌సాగాల‌ని అజిత్ అగార్కర్ కోరుకుంటున్నాడు. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌కప్ వ‌ర‌కు అత‌డు త‌న ప‌ద‌వికాలాన్ని పొడిగించాల‌ని బీసీసీఐని అభ్య‌ర్థించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అతని అభ్యర్థనపై చర్చలు జరుగుతున్నాయని, అయితే ఇప్పటివరకు ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం వెలువడలేదని స‌ద‌రు వార్త‌ల సారాంశం. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భార‌త జ‌ట్టు విజేత‌గా నిలిచిన వెంట‌నే బీసీసీఐని అగార్క‌ర్ అడిగిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2025కు ముందు ఓ ఏడాది పాటు అగార్క‌ర్ ప‌దవి కాలాన్ని బీసీసీఐ పొడిగించిన‌ సంగ‌తి తెలిసిందే.

నాలుగు ఐసీసీ ఫైన‌ల్స్ ఆడితే..

2020-21లో భార‌త క్రికెట్ జ‌ట్టు చీఫ్ సెల‌క్ట‌ర్ ప‌ద‌వి ఖాళీ అయిన‌ప్పుడు అజిత్ అగార్క‌ర్ ఈ పోస్ట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే.. అప్పుడు చేత‌న్ శ‌ర్మ ను చీఫ్ సెల‌క్ట‌ర్ గా బీసీసీఐ నియ‌మించింది. దీంతో అజిత్ అగార్క‌ర్‌కు నిరాశ త‌ప్ప‌లేదు. అయిన‌ప్ప‌టికి 2023 లో మ‌రో సారి ద‌ర‌ఖాస్తు చేసుకోగా ఈ సారి బీసీసీఐ అత‌డిని క‌రుణించింది. 2023 ఏడాది మ‌ధ్య నుంచి చీఫ్ సెల‌క్ట‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను అగార్క‌ర్ నిర్వ‌ర్తిస్తున్నాడు.

Jemimah Rodrigues : ట్రెండీ లుక్‌లో జెమీమా రోడ్రిక్స్‌..

అత‌డి హ‌యాంలో భార‌త జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు ఐసీసీ ఫైన‌ల్స్ (2023 వన్డే ప్రపంచ కప్, 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచ కప్) ఆడింది. ఇందులో మూడింటిలో భార‌త జ‌ట్టు విజేత‌గా నిలిచింది. 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ పైన‌ల్ లో భార‌త్ ఓడిపోయిన‌ప్ప‌టికి జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌ను అభిమానులు అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేరు. వ‌రుస‌గా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఫైన‌ల్‌కు చేరుకుంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024, ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2026 ల‌ను భార‌త జ‌ట్టు కైవ‌సం చేసుకుంది.