Rinku Singh : భారత స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ (Rinku Singh ) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
- Thota Vamshi Kumar
- Published On : February 27, 2026 / 08:28 AM IST
Team India cricketer Rinku Singh father Khachandra Singh passes away
- రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం..
- తండ్రి ఖాన్‌చంద్ సింగ్ కన్నుమూత
Rinku Singh : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా ఆయన లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. స్టేజ్-4 లివర్ క్యాన్సర్ కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో కొద్ది రోజుల కిందట ఆసుపత్రిలో చేరారు.
రింకూ సింగ్ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2026లో ఆడుతున్నాడు. తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని తెలుసుకున్న అతడు దక్షిణాప్రికాతో మ్యాచ్ ముగిసిన వెంటనే జట్టును వదిలి ఇంటికి వెళ్లాడు. రెండు రోజులు ఉన్న అతడు జింబాబ్వేతో మ్యాచ్ ముందు జట్టుతో కలిశాడు. అయితే.. తుది జట్టులో మాత్రం అతడికి స్థానం దక్కలేదు. జట్టు సర్దుబాటులో భాగంగా రింకూ సింగ్ స్థానంలో కుడిచేతి వాటం ఆటగాడు సంజూ శాంసన్‌ను తుది జట్టులో తీసుకున్నారు.
తన తండ్రి మరణవార్త తెలుసుకున్న వెంటనే రింకూ సింగ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు బయలుదేరాడు. విషయం తెలుసుకున్న అభిమానులు, సహచర క్రికెటర్లు, ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
