IND vs AFG : శ‌త‌కాల‌తో చెల‌రేగిన కేఎల్ రాహుల్, శుభ్‌మ‌న్ గిల్.. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ 564/8 డిక్లేర్‌

ముల్ల‌న్‌పూర్ వేదిక‌గా అఫ్గానిస్థాన్ జ‌రుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో (IND vs AFG) భార‌త బ్యాట‌ర్లు దుమ్ములేపారు.

Team India first innings score 564_8 dec only test against Afghanistan

IND vs AFG : ముల్ల‌న్‌పూర్ వేదిక‌గా అఫ్గానిస్థాన్ జ‌రుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భార‌త బ్యాట‌ర్లు దుమ్ములేపారు. ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (100; 165 బంతుల్లో 11 ఫోర్లు), కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (126; 177 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌) శ‌త‌కాల‌తో చెల‌రేగ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 8 వికెట్ల న‌ష్టానికి 564 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేసింది.

Vaibhav Sooryavanshi : మాపై ఒత్తిడి తెచ్చాడు.. మ‌రో మార్గం లేక‌పోయింది.. వైభ‌వ్ సూర్య‌వంశీని ఎంపిక చేయ‌డం పై అజిత్ అగార్క‌ర్ కామెంట్స్‌..

భార‌త బ్యాట‌ర్ల‌లో వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ సాయి సుద‌ర్శ‌న్ (81; 104 బంతుల్లో 13 ఫోర్లు), రిష‌బ్ పంత్ (81; 121 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (52 నాటౌట్ ;68 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌ ) రాణించాడు. అఫ్గానిస్థాన్ బౌల‌ర్ల‌లో మహమ్మద్ సలీం సఫీ 6 వికెట్లు తీశాడు. జియావుర్ రెహమాన్ షరీఫీ, హష్మతుల్లా షాహిదీ లు చెరో వికెట్ సాధించాడు.