Teamindia
Teamindia : టీ20 వరల్డ్‌కప్ విజేతగా టీమిండియా నిలిచింది. ఫ్యాన్స్ అంచనాలను వమ్ముచేయకుండా భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో అద్భుతంగా రాణించింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీని మస్తుగా ఎంజాయ్ చేసిన భారత క్రికెట్ ఫ్యాన్స్.. టీమిండియా తదుపరి ఏఏ దేశాలపై మ్యాచ్‌లు ఆడబోతుందని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా తదుపరి మ్యాచ్ ల షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Also Read : Shahid Afridi : అమీర్‌ను గదిలోకి పిలిచి అఫ్రిది చెంప పగలగొట్టాడు.. కన్నీళ్లు పెట్టుకొని నిజం కక్కేశాడు..
మార్చి 28వ తేదీ నుంచి ఐపీఎల్ -2026 ప్రారంభమవుతుంది. ఈ లీగ్ మే31వ తేదీ వరకు కొనసాగుతుంది. దీంతో టీమిండియా ప్లేయర్లు ఐపీఎల్‌లో నిమగ్నమవుతారు. ఆ తరువాతనే ఇతర దేశాల జట్లపై మ్యాచ్‌లు ఉంటాయి.
జూన్ నెలలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారతదేశంలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఒక టెస్టు, వన్డే సిరీస్ జరుగుతుంది. టెస్ట్ మ్యాచ్ న్యూ చంఢీఘడ్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో జూన్ 6–10 వరకు జరుగుతుంది. అనంతరం జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా మూడు వన్డేలు జరుగుతాయి.
జులై నెలలో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తరువాత మూడు వన్డేలు జరుగుతాయి. టీ20లు చెస్టర్-లీ-స్ట్రీట్, మాంచెస్టర్, నాటింగ్‌హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలుగా జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో.. వన్డేలు ఎడ్జ్‌బాస్టన్, కార్డిఫ్, లార్డ్స్ వేదికలుగా జులై 14, 16, 19 తేదీల్లో జరుగుతాయి.
ఆగస్టు నెలలో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. ఆ తరువాత సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఏషియన్ గేమ్స్ జరుగుతాయి. దాని తర్వాత భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడుతుంది. ఆ తరువాత వెస్టిండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది.
అక్టోబర్ -నవంబర్ నెలలో న్యూజిలాండ్ జట్టు ఇండియాలో పర్యటిస్తుంది. ఇరు జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. డిసెంబర్ నెలలో శ్రీలంక జట్టు ఇండియాలో పర్యటిస్తుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.