Team India : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027లో గ్రూప్ ద‌శ‌లో భార‌త షెడ్యూల్ ఇదే..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027లో గ్రూప్ ద‌శ‌కు సంబంధించిన భార‌త జ‌ట్టు (Team India ) షెడ్యూల్ ఇదే..

Team India schedule in ODI World Cup 2027 group stage

Team India : దక్షిణాప్రికా, జింబాబ్వే, న‌మీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027కు సంబంధించిన‌ షెడ్యూల్‌ను ఐసీసీ విడుద‌ల చేసింది. అక్టోబ‌ర్ 2 నుంచి న‌వంబ‌ర్ 21 వ‌ర‌కు ఈ మెగా టోర్నీ జ‌ర‌గ‌నుంది. మొత్తం 14 జ‌ట్లు క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నాయి. 12 వేదిక‌ల్లో 57 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఇక భార‌త జ‌ట్టు విష‌యానికి వ‌స్తే.. అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, జింబాబ్వే, క్వాలిఫైయర్ ఎల‌తో గ్రూప్‌-ఏలో ఉంది. గ్రూప్-బిలో బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్, ద‌క్షిణాఫ్రికా, శ్రీలంక‌, న్యూజిలాండ్‌, క్వాలిఫైయర్ బి జ‌ట్లు ఉన్నాయి.

ఇక క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తే దాయాదుల స‌మ‌రం భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ అక్టోబ‌ర్ 10న జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు జోహన్నెస్‌బర్గ్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

గ్రూప్ ద‌శ‌లో భార‌త షెడ్యూల్ ఇదే..

7 అక్టోబర్ 2027 గురువారం – భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ( కేప్ టౌన్)
10 అక్టోబర్ 2027 ఆదివారం – భారత్ వర్సెస్ పాకిస్తాన్ (జోహన్నెస్‌బర్గ్)
14 అక్టోబర్ 2027 గురువారం – భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ – ట్ష్వానే
17 అక్టోబర్ 2027 ఆదివారం – భారత్ వర్సెస్ క్వాలిఫయర్ ఎ – బ్లూమ్‌ఫోంటైన్
24 అక్టోబర్ 2027 ఆదివారం – భార‌త్ వ‌ర్సెస్ జింబాబ్వే – విక్టోరియా ఫాల్స్

ఇక గ్రూప్‌-ఏ, గ్రూప్‌-బిలో టాప్‌-3లో నిలిచిన జ‌ట్లు నేరుగా సూప‌ర్‌-7 ద‌శ‌కు చేరుకుంటాయి. అంతేకాదండోయ్‌ రెండు గ్రూపుల్లో నాలుగో స్థానంలో నిలిచిన జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు కూడా సూప‌ర్‌-7కు చేరుకుంటుంది. అక్క‌డ రౌండ్ రాబిన్ ప‌ద్ద‌తిలో అంటే.. గ్రూపులో ఒక జ‌ట్టు మిగిలిన జ‌ట్ల‌తో ఒక్కొ మ్యాచ్ ఆడ‌నుంది. టాప్‌-4లో నిలిచిన జ‌ట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. సెమీస్‌లో గెలిచిన జ‌ట్లు ఫైన‌ల్ ఆడ‌నున్నాయి.

సెమీ ఫైనల్స్..

17 నవంబర్ 2027 బుధవారం – సెమీ-ఫైనల్ 1 (కేప్ టౌన్)
18 నవంబర్ 2027 గురువారం – సెమీ-ఫైనల్ 2 (ట్ష్వానే)

ఫైన‌ల్..

21 నవంబర్ 2027 ఆదివారం – ఫైనల్ ( జోహన్నెస్‌బర్గ్)