Ind Vs NZ : కివీస్ టార్గెట్ 540 పరుగులు…చెలరేగిన అక్షర్ పటేల్

భారత్ రెండో ఇన్నింగ్స్ ను 7 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసి డిక్లైర్ చేసింది. దీంతో కివీస్ 540 పరుగులు చేయాల్సి ఉంది. చివరిలో అక్షర్ పటేల్ చెలరేగిపోయి ఆడాడు.

Team India vs new zealand : ముంబై వాంఖడే స్టేడియం వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఆఖరి టెస్టు మ్యాచ్‌ కొనసాగుతోంది. భారత్ రెండో ఇన్నింగ్స్ ను 7 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇండియాకు తొలి ఇన్నింగ్స్ లో  263 రన్స్ భారీ ఆధిక్యం ఉంది. దీంతో కివీస్ ముందు  540 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టింది కోహ్లీ సేన. భారత రెండో ఇన్నింగ్స్ చివరిలో అక్షర్ పటేల్ చెలరేగిపోయి ఆడాడు. కేవలం 26 బంతులను ఎదుర్కొన్న అక్షర్…మూడు ఫోర్లు, ఆరు సిక్స్ లు కొట్టి…41 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. అనంతరం కివీస్‌ను కేవలం 62 పరుగులకే కుప్పకూల్చి తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం (263) సాధించింది. 2021, డిసెంబర్ 05వ తేదీ ఆదివారం టీమిండియా 69 పరుగులతో మూడో రోజు ఆట ఆరంభించింది.

Read More : Aayushman Bharat Scheme : ఆర్మీకి కూడా ఆయుష్మాన్ భారత్ పతకం వర్తింపు

రెండో ఇన్నింగ్స్ లో మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇతనికి పుజారా చక్కటి సహకారం అందించాడు. న్యూజీలాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ బ్యాట్స్ మెన్.. గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలించారు. 28 ఓవర్లలో టీమిండియా ఒక వికెట్ కోల్పోకుండా… 100 పరుగులు చేసింది. దీంతో భారత్ అధిక్యం 363 పరుగులకు చేరింది. అయితే.. అజాజ్ వేసిన 32 ఓవర్ లో తొలి బంతిని మయాంక్ బౌండరీ బాదాడు. రెండో బంతిని భారీ షాట్ గా మలుద్దామని అనుకున్న మయాంక్…విల్ యంగ్ చేతికి చిక్కాడు. దీంతో 62 పరుగుల వద్ద మయాంక్ అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 107 పరుగులు. అనంతరం పుజారా కూడా తృటిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

Read More : Gold Necklace Missing : 10 తులాల నెక్లెస్ పోగొట్టుకున్న మహిళ.. గంటలో వెతికి తెచ్చిన పోలీసులు

కానీ…36 ఓవర్ లో పుజారా 47 అవుట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ సాధించకుండానే…క్రీజును వదలాల్సి వచ్చింది. శుభమన్ గిల్ కు కెప్టెన్ విరాట్ కోహ్లీ..జత కలిశాడు. వికెట్ కోల్పోకుండా..వీరిద్దరూ ఆచితూచి ఆడారు. శుభమన్ గిల్ కూడా తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. రచిన్ రవీంద్ర వేసిన బంతికి గిల్ (47) లాథమ్ చేతికి చిక్కాడు. 197 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కోహ్లీకి..శ్రేయస్ అయ్యర్ కలిశాడు. వచ్చి రాగానే..బ్యాట్ కు పని చెప్పాడు. జట్టు స్కోరు 211 పరుగుల వద్ద ఉన్నప్పుడు…శ్రేయస్ అయ్యర్ (14) వికెట్ కోల్పోయింది. కోహ్లీ (36), సాహా (13) వెనుదిరిగారు. క్రీజులో ఉన్న అక్షర్ పటేల్ బౌండరీలతో చెలరేగిపోయాడు. కేవలం 26 బంతులను ఎదుర్కొన్న అక్షర్…41 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, నాలుగు సిక్స్ లు ఉండడం విశేషం. 70 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 276 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ను భారత్ డిక్లేర్డ్ చేసింది. దీంతో కివీస్ ముందు…540 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా విజయం దాదాపు ఖాయమైనట్టే అని, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో గట్టెక్కడం అసాధ్యం అని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు