IND vs AFG : ప్రారంభమైన భారత్ వర్సెస్ అఫ్గాన్ టెస్టు మ్యాచ్.. యువ స్పిన్నర్ అరంగ్రేటం..
ముల్లన్‌పూర్ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ (IND vs AFG) ప్రారంభమైంది.
- Thota Vamshi Kumar
- Updated on- June 6, 2026 / 10:57 AM IST
Team India Win the toss and opt to bat against one off test Afghanistan
IND vs AFG : ముల్లన్‌పూర్ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. సీనియర్ ఆటగాడు కుల్దీప్ యాదవ్ చేతుల మీదుగా సుతార్ టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు. మరోవైపు అఫ్గాన్ జట్టు తరుపున నంగేలియా ఖరోటే అనే స్పిన్నర్ అరంగ్రేటం చేశాడు.
R Praggnanandhaa : చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడు..
‘మేము మొదట బ్యాటింగ్ చేస్తాం. ఇక్కడ చాలా వేడిగా, తేమగా ఉంది. కాబట్టి సమయం గడిచేకొద్దీ వికెట్ స్లో అవుతుందని అనుకుంటున్నాను. అప్పుడు బౌలర్లకు సహకారం అందొచ్చు. పిచ్ బాగుంది. ఇక సొంత గడ్డపై తొలిసారి కెప్టెన్సీ చేయడం చాలా ప్రత్యేకంగా ఉంది. నేను ఇక్కడికి దగ్గర్లోనే పెరిగాను. కాబట్టి ఇది నా సొంత మైదానం. ఇక్కడ నా దేశానికి తొలిసారి కెప్టెన్సీ చేసే అవకాశం రావడం గొప్ప గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నాను. మ్యాచ్ కోసం మంచిగా సన్నద్ధం అయ్యాయి. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ టెస్టు తరువాత ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో భాగంగా 9 టెస్టులు ఆడాల్సి ఉంది. వాటిలో రెండు శ్రీలంకలో మరో ఐదు స్వదేశంలో ఆడతాము. కాబట్టి ఈ మ్యాచ్ ద్వారా కూర్పును సరిచూసుకుంటాము. ఓ బ్యాటింగ్ గ్రూప్‌గా మేము నిరూపించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని అనుకుంటున్నాము. మానవ్ సుతార్ అరంగేట్రం చేస్తున్నాడు.’ అని శుభ్‌మన్ గిల్ అన్నాడు.
‘నిజం చెప్పాలంటే వికెట్ చాలా బాగుంది. టాస్ గెలిచి ఉంటే మేము కూడా ముందుగా బ్యాటింగ్ చేసే వాళ్లం. అయితే టాస్ అనేది మా చేతుల్లో లేదు. ఏదీ ఏమైనప్పటికి కూడా మేము మంచి క్రికెట్ ఆడతాము. సవాలుకు సిద్ధంగా ఉన్నాము. మా కుర్రాళ్లకు కూడా సవాళ్లు అంటే చాలా ఇష్టం. ఈ మ్యాచ్ కోసం చాలా బాగా సన్నద్ధం అయ్యాము. మేము ముగ్గురు పేసర్లు ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాము. నంగేలియా ఖరోటే అరంగ్రేటం చేస్తున్నాడు.’ అని అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది తెలిపాడు.
అఫ్గానిస్థాన్ తుది జట్టు..
సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అఫ్సర్ జజాయ్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, జియావుర్ రెహమాన్ షరీఫీ, మహ్మద్ సలీమ్ సఫీ
భారత తుది జట్టు..
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
