వరుస ఓటములు.. సిరీస్ వైఫల్యాలు.. సొంతగడ్డపైనే విజయం దక్కించుకోలేని భారత్.. విదేశాల్లో అదీ.. పరాజయాలు చవిచూసిన ఇంగ్లాండ్ గడ్డపైన ఆడి ప్రపంచ కప్ గెలుచుకోలదాననే సందేహాలు సగటు క్రీడాభిమానిలో తలెత్తుతున్నాయి. విదేశీ పర్యటనలు ముగించుకుని స్వదేశానికి చేరుకున్న భారత్.. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడిన 2 సిరీస్ లలోనూ ఓటమికి గురైంది.
Read Also : త్వరగా కోలుకో: హాస్పిటల్ పాలైన సైనా నెహ్వాల్
టాపార్డర్ పటిష్టంగానే కనిపిస్తున్నా.. బౌలింగ్ విభాగం సత్తా కనబరుస్తున్నా జట్టు తలరాత మారడం లేదు. విదేశీ పిచ్ లకు భారత్ లోని మైదానాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ధోనీ లేకుంటే విరాట్ కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడా అనేలా ఉంది ఈ మూడు వన్డేల ఫలితం. మరో వైపు ప్రపంచ కప్.. కు ముందు ఐపీఎల్ .. టీ20 ఫార్మాట్ కు అలవాటు పడిన ప్లేయర్లు వన్డేలలో ఎలా నెగ్గుకురాగలరు. కోచ్.. కోహ్లీ.. వ్యూహాలు సగటు అభిమానికి అర్థం కాకుండా ఉన్నాయి.