Shubman Gill : శుభ్‌మాన్ గిల్ బర్త్‌డే పార్టీ వీడియో వైరల్.. స్నేహితులతో కలిసి ఏం చేశాడో చూడండి..
టీమిండియా యువ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో గిల్ పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.
- Harishth Thanniru
- Published On : September 10, 2024 / 07:13 AM IST
Shubman Gill
Shubman Gill Birthday Celebration Video : టీమిండియా యువ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ గత ఆదివారం 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం గిల్ దులీప్ ట్రోపీ-2024 మ్యాచ్ లో ఆడుతున్నందున మ్యాచ్ ముగిసిన తరువాత తన స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బర్త్ డే పార్టీలో తన స్నేహితుడు, ప్రముఖ పంజాబీ సంగీతకారుడు కరణ్ ఔజ్లాతో కలిసి పంజాబీ ర్యాప్ పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఇదిలాఉంటే గిల్ కు పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ నటులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.
Also Read : ఎంఎస్ ధోని రికార్డును సమం చేసిన యంగ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్
బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ కు బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నాడు. బహుశా గిల్ మూడో నెంబర్ బ్యాటర్ గా క్రీజులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దులీప్ ట్రోపీ -2024 మొదటి మ్యాచ్ లో గిల్ పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. ఇండియా -ఏ కెప్టెన్ గా ఉన్న గిల్.. మొదటి ఇన్నింగ్స్ లో 25 పరుగులు మాత్రమే చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 21 పరుగులకే ఔట్ అయ్యాడు. రెండు సదర్భాల్లోనూ అతడిని నవదీప్ సైనీ ఔట్ చేయడం గమనార్హం.
బంగ్లాదేశ్ జట్టు స్వదేశంలో పాకిస్థాన్ జట్టుతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ లలో 2-0 తేడాతో విజయం సాధించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్ పై బంగ్లాదేశ్ కు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం కావటం గమనార్హం. ఇండియాతో జరిగే టెస్టు సిరీస్ లోనూ రాణించేందుకు ఆ జట్టు ఉత్సాహంతో ఉంది. బంగ్లా దూకుడుకు టీమిండియా ఏ విధంగా అడ్డుకట్ట వేస్తుందోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ చెనైలో ఈనెల 19 నుంచి ప్రారంభమవుతుంది.
Singer Shubman Gill enjoying his birthday. 😄👌pic.twitter.com/aQivF2s0OZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 9, 2024
