ఎంఎస్ ధోని రికార్డును సమం చేసిన యంగ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్

ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 క్యాచ్‌లు అందుకుని.. 20 ఏళ్లుగా ఎంఎస్ ధోని పేరిట ఉన్న రికార్డును ఈక్వల్ చేశాడు.

ఎంఎస్ ధోని రికార్డును సమం చేసిన యంగ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్

Dhruv Jurel Equals MS Dhoni Record in Duleep Trophy (Photo: @BCCIdomestic)

Dhruv Jurel Equals MS Dhoni Record: టీమిండియా యంగ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ స్టంపర్ ఎంఎస్ ధోని రికార్డును అతడు సమం దేశాడు. దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో అతడీ ఫీట్ రికార్డు చేశాడు. భారత్ A జట్టు తరపున అతడు ప్రస్తుతం ఆడుతున్నాడు. బెంగళూరులో భారత్ B జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 క్యాచ్‌లు అందుకుని.. 20 ఏళ్లుగా ధోని పేరిట ఉన్న రికార్డును ఈక్వల్ చేశాడు. 2004-05 దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరపున ఆడిన ధోని.. సెంట్రల్ జోన్ తో జరిగిన మ్యాచ్‌లో ఏడు క్యాచ్‌లు పట్టి రికార్డు క్రియేట్ చేశాడు. ధోనిని దేవుడిలా భావించే ధ్రువ్ జురెల్ తాజాగా ఈ రికార్డును సమం చేయడం విశేషం.

కాగా, బెంగళూరు వేదికగా భారత్ B జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం రెండు పరుగులే చేయగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ B జట్టు 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ B టీమ్ 321, A టీమ్ 231 పరుగులు చేశాయి. ముషీర్ ఖాన్ భారీ సెంచరీ (181)తో B జట్టుకు భారీ స్కోరు అందించాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో B టీమ్ 184, A టీమ్ 198 పరుగులు చేశాయి.

భారత్ A జట్టు బౌలర్ ఆకాశ్ దీప్ రెండు ఇన్నింగ్స్‌లోనూ కలిపి మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ 5, అవేశ్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. భారత్ B జట్టు బౌలర్లలో ముకేశ్ కుమార్ 5, నవదీప్ షైనీ 5, యశ్ దయాల్ 4 వికెట్లు సాధించారు. సెంచరీ హీరో ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.

Also Read : రిషబ్ పంత్ రీఎంట్రీ.. శ్రేయాస్‌కు షాకిచ్చిన బీసీసీఐ.. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే