Irfan Pathan : 8వ పెళ్లిరోజున భార్య ఫేస్ రివీల్ చేసిన క్రికెటర్
పెళ్లై 8 సంవత్సరాలైనా ఇర్ఫాన్ పఠాన్ భార్య ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియదు. తాజాగా ఇర్ఫాన్ భార్యతో ఉన్న ఫోటో చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు.
- Lakshmi 10tv
- Updated on- February 4, 2024 / 06:13 PM IST
Irfan Pathan
Irfan Pathan : భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మొదటిసారి తన భార్యని ప్రపంచానికి చూపించారు. 8వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆమెతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ఇర్ఫాన్ పఠాన్‌కు వివాహమై 8 సంవత్సరాలు అవుతోంది. అయితే ఎప్పుడూ తన భార్యను చూపించకుండా దాచిపెట్టినందుకు విమర్శలు ఎదుర్కున్నారు. తాజాగా 8వ వివాహ వార్షికోత్సవం సందర్భంలో ఇర్ఫాన్ తన భార్య సఫా బేగ్‌తో ఉన్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘మూడ్ బూస్టర్, ట్రబుల్ మేకర్, ఎప్పుడూ నవ్వించే వ్యక్తి, నన్ను నా పిల్లలకు మంచి స్నేహితురాలు..అందమైన జీవిత ప్రయాణంలో నా భార్యగా ఉన్న నీకు 8వ పెళ్లిరోజు శుభాకాంక్షలు.. మై లవ్’ అనే శీర్షికతో ఇర్ఫాన్ పోస్టు పెట్టారు. ఇర్ఫాన్ ప్రపంచానికి తన భార్యను చూపించింది ఇదే మొదటిసారిగా తెలుస్తోంది.
ఇర్ఫాన్ భార్య ఫోటోలను చూసిన నెటిజన్లు ఇద్దరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పారు. చూడచక్కని జంట అంటూ ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇర్ఫాన్-సఫా బేగ్ జంట ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
