T20 World Cup 2026 Representative Image (Image Credit To Original Source)
T20 World Cup 2026: కొందరికి క్రికెట్ అంటే ఎంత అభిమానమో మాటల్లో చెప్పలేము. క్రికెట్ అంటే పిచ్చి. క్రికెట్ ను విపరీతంగా ప్రేమిస్తారు. క్రికెట్ ను తమ శ్వాసగా ఫీల్ అవుతారు. అభిమానుల్లో కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. తాజాగా జరిగిన ఒక ఘటన దీన్ని మరోసారి ప్రూవ్ చేసింది. టీ20 వరల్డ్ కప్ లో తమ జట్టు ఆడే మ్యాచులు చూసేందుకు ఆ దేశ క్రికెట్ అభిమానులు ఎంతో రిస్క్ తీసుకున్నారు. బోర్డర్లు, రాష్ట్రాలు దాటి మరీ వచ్చారు. ఒక దేశం నుంచి మరో దేశానికి జర్నీ చేశారు. 36 గంటల పాటు ట్రైన్ లో ప్రయాణం చేసి మరీ నేపాల్ నుంచి భారత్ చేరుకున్నారు. తమ జట్టు ఆడే ప్రతీ మ్యాచ్ కళ్లారా చూసేందుకు వారు నేపాల్ నుంచి ముంబై రావడం విశేషం.
నేపాల్ నుంచి ముగ్గురు క్రికెట్ అభిమానులు భారత్ కు వచ్చారు. తమ జట్టు ఆడే మ్యాచులను చూసేందుకు వారు సుదీర్ఘ ప్రయాణం చేశారు. జాకా షాహా, తేగేంద్ర షాహి, జీవన్ షాహి.. టీ20 ప్రపంచ కప్ కోసం నేపాల్‌లోని గ్రామం నుంచి జర్నీని ప్రారంభించారు. తాము రైల్లో వచ్చామని తెలిపారు. ఇందుకు 30 నుండి 36 గంటలు పట్టిందన్నారు.
వీరంతా ఒకే రైల్లో కలిసి ప్రయాణించారు. సరిహద్దులు, రాష్ట్రాలను దాటి వచ్చారు. తమ గ్రామం నుండి ప్రయాణం ప్రారంభించి 10 రోజులైందని తెలిపారు. నేపాల్ క్రికెట్ జట్టు ఆడే నాలుగు మ్యాచ్‌లు చూసేందుకు వచ్చామన్నారు.
నేపాల్ జట్టులో మీకు ఇష్టమైన ఆటగాళ్లు ఎవరు అని అడిగితే.. దీపేంద్ర సింగ్ ఐరీ, కుశాల్ భూర్తెల్ పేర్లు చెప్పారు. ఇక ఇండియన్ క్రికెటర్ల విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ పేర్లు చెప్పారు. ఈ మెగా టోర్నీలో తమ జట్టు అద్భుత విజయాలు సాధించి మందుకు సాగాలని ఈ ముగ్గురు ఆకాంక్షించారు.
నేపాల్ జట్టు సూపర్ 8 దశకు చేరుకునే అవకాశాల గురించి అడిగినప్పుడు. ముందుకు వెళ్లే ఛాన్స్ లేకపోలేదన్నారు. మేము రెండుసార్లు వెస్టిండీస్‌ను ఓడించాము అని గుర్తు చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో షార్జాలో జరిగిన T20I సిరీస్‌లో నేపాల్ వెస్టిండీస్‌ను 2-1 తేడాతో ఓడించినప్పుడు సాధించిన ఘనతను ప్రస్తావించారు.
రైల్లో ఒక రోజు కంటే ఎక్కువ దూరం ప్రయాణించారు. తమ పనులను సర్దుబాటు చేసుకున్నారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా నేపాల్ ఆడే ప్రతి మ్యాచ్‌ను చూడాలని డిసైడ్ అయ్యారు.
క్రికెట్ పై వీరికున్న అభిమానానికి అంతా ఫిదా అవుతున్నారు. మీరు ఇంత క్రికెట్ పిచ్చోళ్లు ఏంటి బ్రో అని ఆశ్చర్యపోతున్నారు. కనీసం మీ కోసమైనా నేపాల్ క్రికెట్ జట్టు ఓ రెండు మ్యాచ్ లైనా గెలవాలని కోరుకుంటున్నారు.
Also Read: వైభవ్ సూర్యవంశీ నెక్ట్స్ రెండు అండర్ 19 వరల్డ్ కప్‌లలో పాల్గొనడు.. ఎందుకు..