Tilak Varma : చ‌రిత్ర సృష్టించిన తెలుగు తేజం తిల‌క్ వ‌ర్మ‌.. టీ20 క్రికెట్‌లో ఏకైక ఆట‌గాడు..

టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు, తెలుగు తేజం తిల‌క్ వ‌ర్మ (Tilak Varma ) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Tilak Varma Only one batter in T20 history has aggregated 5000 plus at an average of 40 plus strike rate of 140 plus

Tilak Varma : టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు, తెలుగు తేజం తిల‌క్ వ‌ర్మ అరుదైన ఘ‌న‌త సాధించాడు. రాంచి వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కేవ‌లం 18 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాది 44 ప‌రుగుతో అజేయంగా నిలిచాడు. ఈక్ర‌మంలో టీ20 క్రికెట్‌లో 5 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు.

టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 5వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న ఐదో భార‌త‌ ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అత‌డు 143 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త సాధించాడు. ఆ త‌రువాత రుతురాజ్ గైక్వాడ్‌, శుభ్‌మ‌న్ గిల్, అభిషేక్ శ‌ర్మ‌లు ఉన్నారు.

టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన టాప్‌-5 భార‌త బ్యాట‌ర్లు వీరే..

* కేఎల్ రాహుల్ – 143 ఇన్నింగ్స్‌ల్లో
* రుతురాజ్ గైక్వాడ్ -145 ఇన్నింగ్స్‌ల్లో
* శుభ్‌మన్ గిల్ – 154 ఇన్నింగ్స్‌ల్లో
* అభిషేక్ శర్మ – 165 ఇన్నింగ్స్‌ల్లో
తిలక్ వర్మ – 166 ఇన్నింగ్స్‌ల్లో

Shai Hope : రెండో టీ20 మ్యాచ్‌లో విజ‌యం.. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ కామెంట్స్ వైర‌ల్‌.. నిజం చెప్పాలంటే..

ఒకే ఒక్క‌డు..

టీ20 క్రికెట్‌లో 40కి పైగా స‌గ‌టు 140 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో 5000 ప‌రుగుల మైలురాయిని చేరుకున్న ఏకైక క్రికెట‌ర్‌గా తిల‌క్ వ‌ర్మ నిలిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 143 మంది ఆట‌గాళ్లు టీ20ల్లో 5 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నారు. వీరిలో 44 మంది 140 లేదా అంత‌కంటే ఎక్కువ స్ట్రైక్‌రేటును కొన‌సాగిస్తూ ఈ మైలురాయిని సాధించారు. ఆ 143 మందిలో ఐదుగురు ఆట‌గాళ్లు 40 లేదా అంత‌కంటే ఎక్కువ స‌గ‌టును క‌లిగి ఉన్నారు.