Tilak Varma : ‘ఇది నేను ఊహించలేదు.. నా కల అదే..’ దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ కామెంట్స్..
తాను ఊహించిన దాని కంటే వేగంగా కోలుకుని జాతీయ జట్టులోకి వచ్చానని టీమ్ఇండియా స్టార్ ఆటగాడు తిలక్ వర్మ (Tilak Varma ) తెలిపాడు.
- Thota Vamshi Kumar
- Published on- February 5, 2026 / 03:23 PM IST
Tilak Varma Reserves Special Credit After Recovering For T20 World Cup
Tilak Varma : తాను ఊహించిన దాని కంటే వేగంగా కోలుకుని జాతీయ జట్టులోకి వచ్చానని టీమ్ఇండియా స్టార్ ఆటగాడు తిలక్ వర్మ తెలిపాడు. ఇందుకు సాయం చేసిన బీసీసీఐ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు కతృజ్ఞతలు తెలియజేశాడు. తాను, టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్‌కు సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చాడు.
బుధవారం నవీ ముంబై వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
WPL 2026 : ఆర్‌సీబీ వర్సెస్ ఢిల్లీ ఫైనల్ మ్యాచ్.. హెడ్-టు-హెడ్, పిచ్ రిపోర్టు..
ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌తోనే భారత జట్టుతో కలిశాడు. మ్యాచ్ అనంతరం తిలక్ మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే తాను ఇంత త్వరగా మైదానంలో అడుగుపెడతానని ఊహించలేదన్నాడు. ఇందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, బీసీసీఐ ధన్యవాదాలు తెలియజేశాడు. ఇక ప్రపంచకప్ ఆడాలనేది తన కల అని చెప్పుకొచ్చాడు.
Ishan Kishan : అలా ఎలా కొట్టావ్ ఇషాన్.. ఈ షాట్‌ను ఏమని పిలవాలో? వీడియో
ఇక తాను మైదానంలో అడుగుపెడుతున్న సమయంలో ప్రేక్షకులు పెద్ద ఎత్తున తన పేరుతో నినాదాలు చేయడం బాగుందన్నాడు. తాను ఇలాంటిది అసలు ఊహించలేదన్నాడు. ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. అభిషేక్, ఇషాన్ ల బ్యాటింగ్ చూసిన తరువాత తాను హిట్టింగ్ చేయాలని నిర్ణయించుకున్నాని చెప్పాడు. వార్మప్ మ్యాచ్‌కు ఇంత మంది వస్తారని ఊహించలేదన్నాడు. తనతో పాటు భారత జట్టు ప్రపంచకప్‌కు సిద్ధంగా ఉందని తిలక్ తెలిపాడు.
