Tim David : ఆర్‌సీబీకి బిగ్ షాక్‌.. స్టార్ ఆట‌గాడిపై స‌స్పెప్ష‌న్.. వ‌చ్చే ఏడాది తొలి మ్యాచ్‌కు దూరం..

స్టార్ ఆట‌గాడు టిమ్ డేవిడ్ (Tim David)వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌లో (2027లో) ఆర్‌సీబీ ఆడే తొలి మ్యాచ్‌లో ఆడేందుకు వీలు లేకుండా పోయింది.

Tim David suspended for first match of IPL 2027

  • ఫైన‌ల్ మ్యాచ్‌లో ఐపీఎల్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌
  • టీమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జ‌రిమానా, రెండు డీమెరిట్ పాయింట్ల జ‌త‌
  • దీంతో అత‌డి ఖాతాలో 5కు చేరిన డీమెరిట్ పాయింట్లు

Tim David : వ‌రుస‌గా రెండో సారి ఐపీఎల్ ఛాంపియ‌న్‌గా నిలిచిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు ఐపీఎల్ నిర్వాహ‌కులు భారీ షాక్ ఇచ్చారు. దీంతో ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు టిమ్ డేవిడ్ వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌లో (2027లో) ఆర్‌సీబీ ఆడే తొలి మ్యాచ్‌లో ఆడేందుకు వీలు లేకుండా పోయింది.

ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియమావళిలోని లెవెల్‌-1ని ఉల్లంఘించాడు. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ నిర్వాహ‌కులు టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జ‌రిమానాగా విధించారు. అంతేకాదండోయ్ అత‌డి ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లు చేర్చారు.

Shubman Gill : ఓడిపోయామ‌ని ఈ విష‌యం చెప్ప‌డం లేదు.. గెలిచినా కూడా ఇదే చెప్పేవాడిని.. శుభ్‌మ‌న్ గిల్ హాట్ కామెంట్లు

టిమ్ డేవిడ్ చేసిన త‌ప్పు ఏంటి?

గుజ‌రాత్ ఇన్నింగ్స్‌ 10వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఓవ‌ర్‌లో వికెట్ ప‌డిన త‌రువాత అంపైర్ నితిన్ మీన‌న్ వైపు ఐస్ బ్యాగ్‌ను టిమ్ డేవిడ్ ప్ర‌మాద‌క‌రంగా విసిరివేసిన‌ట్లు స‌మాచారం. ఇక చేసిన త‌ప్పును ఒప్పుకోవ‌డంతో పాటు మ్యాచ్ రిఫ‌రీ జ‌వ‌గ‌ల్ శ్రీనాథ్ విధించిన శిక్ష‌ను డేవిడ్ అంగీక‌రించాడు.

అయితే.. ఇప్ప‌టికే అత‌డి ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు ఉండ‌గా తాజాగా వాటితో క‌లిపి ఆ సంఖ్య 5కి చేరింది. ఈ క్ర‌మంలో నిబంధ‌న‌ల ప్ర‌కారం అత‌డి పై ఓ మ్యాచ్ స‌స్పెప్ష‌న్ వేటు ప‌డింది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌లో అత‌డు ఆడే తొలి మ్యాచ్‌కు అత‌డు దూరం అవుతాడు.