India
Wrestler Ravi Kumar Dahiya : ఒలింపిక్స్ రెజ్లింగ్ లో నిరాశ ఎదురైంది. గోల్డ్ మెడల్ సాధిస్తాడనుకున్న రవి దహియా ఫైనల్ లో ఓడిపోయాడు. అయినా రజతంతో మెరిశాడు. ఒలింపిక్స్‌కు ఇండియా వెళ్లినప్పుడు అతని పేరు పెద్దగా వినిపించలేదు. పక్కాగా మెడల్ తీసుకొస్తాడన్న లిస్ట్‌లో రవికుమార్ దహియా పేరు లేనే లేదు. కానీ అతడు ఎవరూ ఊహించని సంచలన విజయాన్ని సాధించాడు. రెజ్లింగ్ 57 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్ ఫైనల్ లో ఓడినా.. భారత్ కు రజతాన్ని అందించాడు. ఫైనల్ మ్యాచ్ లో రష్యాకి చెందిన జౌర్ ఉగేవ్ చేతిలో 4-7 తేడాతో ఓడిపోయాడు.
భారత రెజ్లింగ్ అంటే ఇన్నాళ్లూ సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ పేర్లే ఠక్కున గుర్తుకు వచ్చేవి. కానీ ఈరోజు నుంచి అందరికీ తన పేరు చిరకాలం గుర్తుండిపోయేలా చేశాడు భారత యువ రెజ్లర్ రవి కుమార్ దహియా. తొలిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన ఈ హరియాణా మల్లయోధుడు టోక్యోలో తన పట్టుదలతో ప్రకంపనలు సృష్టించాడు. రజతంతో మెరిసి చరిత్ర సృష్టించాడు. భారతదేశానికి సుశీల్ కుమార్ 2008లో కాంస్యం, 2012లో రజతం గెలిచాడు. 2016లోనూ భారత్‌కు కాంస్యం దక్కింది. ఇప్పుడు రవి రజతం సాధించాడు.
Read More : PM Modi : ఆగస్టు-5 చరిత్రలో నిలిచిపోతుంది