T20 World Cup Representative Image (Image Credit To Original Source)
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇవాళ్టి సౌతాఫ్రికా, అఫ్ఘానిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్.. క్రికెట్ ఫ్యాన్స్ కు అసలుసిసలు మజా ఇచ్చింది. నరాలు తెగే ఉత్కంఠభరిత క్షణాలను ఎక్స్‌పీరియన్స్ చేశారు క్రికెట్ లవర్స్. పసి కూన అయినా.. సౌతాఫ్రికాకు ముచ్చెమటలు పట్టించింది అప్ఘాన్ జట్టు. ఓడించినంత పని చేసింది. సౌతాఫ్రికా టార్గెట్‌ను టై చేసిన అప్ఘాన్.. తర్వాత 2 సార్లు సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఫలితం.. డబుల్ సూపర్ ఓవర్ ద్వారా తేలడం విశేషం. ఒక సూపర్ ఓవరే హైలైట్ అనుకుంటే.. ఇక్కడ డబుల్ సూపర్ ఓవర్ కు దారితీయడం డబుల్ కిక్ ఇచ్చిందనే చెప్పాలి. రెండో సూపర్ ఓవర్ లో 24 పరుగుల టార్గెట్ ను అప్ఘాన్ చేజ్ చేయలేకపోయింది. కానీ, ఫ్యాన్స్ కు మాంచి కిక్ ఇచ్చింది. ఈ వరల్డ్ కప్ లో తొలి డబుల్ సూపర్ ఓవర్ నమోదైంది.
అభిమానులు ఇలాంటి థ్రిల్ ను ఎక్స్ పీరియన్స్ చేయడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. గతంలోనూ నరాలు తెగేంత ఉత్కంఠభరిత మ్యాచ్ లు జరిగాయి. టోర్నమెంట్ చరిత్రలో టాప్ 5 థ్రిల్లింగ్ సూపర్ ఓవర్లు ఇవే..
2024 టీ 20 వరల్డ్ కప్ లో నమీబియా, ఒమన్ మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. కెన్ సింగ్ టన్ ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. నమీబియా, ఒమన్ హోరాహోరాగా తలపడ్డాయి. ఫలితంగా సూపర్ ఓవర్ కు దారితీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 109 పరుగులు చేసింది. చివరి ఓవర్ లో విజయానికి 5 పరుగులు చేయాల్సి ఉండగా నమీబియా తడబడింది. సూపర్ ఓవర్ కు దారితీసింది.
సూపర్ ఓవర్ లో డేవిడ్ వీస్, గెర్హార్డ్ ఎరాస్ మస్ 21 పరుగులు చేశారు. డేవిడ్ వీస్ బాల్ తోనూ రాణించాడు. ఒమన్ ను 10 పరుగులకే కట్టడి చేశాడు. నమీబియాకు ఘన విజయం అందించాడు. మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్లేలా ఒమన్ గట్టిగానే పోరాటం చేసింది. కానీ సూపర్ ఓవర్ లో విజయాన్ని అందుకోలేకపోయింది.
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్, శ్రీలంక తొలిసారి సూపర్ ఓవర్ ను చూశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. శ్రీలకం 6 వికెట్ల నష్టానికి 174 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ కు దారితీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఒక బౌండరీ కూడా కొట్టకుండా 13 పరుగులు చేసింది. లసిత్ మలింగ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రత్యర్థిని కట్టడి చేసి జట్టుకి ఘన విజయాన్ని అందించాడు.
2012 వరల్డ్ కప్ లో మరో సూపర్ ఓవర్ నమోదైంది. వెస్టిండీస్, న్యూజిలాండ్ మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. వెస్టిండీస్ ను 139 పరుగులకే కట్టడి చేసిన కివీస్.. టార్గెట్ ను చేజ్ చేయలేకపోయింది. 139 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ కు దారితీసింది. రాస్ టేలర్ సిక్స్, ఫోర్ కొట్టడంతో కివీస్ 17 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లు క్రిస్ గేల్, శ్యామూల్స్ చెలరేగారు. కేవలం 5 బంతుల్లో టార్గెట్ ను ఫినిష్ చేశారు. టిమ్ సౌథీ బౌలింగ్ లో చెరో సిక్స్ బాదారు.
యూఎస్ఏ వర్సెస్ పాకిస్తాన్-2024
టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత చిరస్మరణీయమైన సూపర్ ఓవర్లలో 2024 ఎడిషన్‌లో USA – పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ ఓవర్ ఒకటి. ఇది డల్లాస్‌లో జరిగిన గ్రూప్ A మ్యాచ్. USA భారీ ఓటమిని చవిచూసింది.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 7 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేసింది. USA బ్యాటర్లు ధీటుగా ఆడారు. స్కోర్ ని సమం చేశారు. మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్‌కి దారితీసింది. సూపర్ ఓవర్‌లో, హర్మీత్ సింగ్, ఆరోన్ జోన్స్ మొహమ్మద్ అమీర్ బౌలింగ్‌లో 18 పరుగులు చేశారు. సౌరభ్ నేత్రావల్కర్ ఒత్తిడిని తట్టుకుని పాకిస్తాన్‌ను 13/1కి పరిమితం చేయడంతో USA 5 పరుగుల తేడాతో చరిత్రాత్మక విజయాన్ని సాధించింది.
సౌతాఫ్రికా వర్సెస్ అప్ఘానిస్తాన్-2026
దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్.. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన పోటీలలో ఒకటి. మొదట బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ జట్టు 187/6 పరుగులు చేసింది. అద్భుతంగా ఆడిన ఆఫ్ఘనిస్తాన్ ఒత్తిడిలో తప్పిదం చేసింది. ఫలితంగా 187 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇది సూపర్ ఓవర్ కు దారితీసింది.
మొదటి సూపర్ ఓవర్ లో ఇరు జట్లు 17 పరుగులు చేశాయి. దీంతో రెండో సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో దక్షిణాఫ్రికా 23 పరుగులు బాదింది. రెండో సూపర్ ఓవర్‌లో అఫ్ఘాన్ 19 పరుగులు మాత్రమే చేసింది. దీంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో గెలిచింది.
మొదటి సూపర్ ఓవర్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ 17 పరుగులు సాధించాడు. అయితే ఫజల్హాక్ ఫరూఖీ స్కోర్ ను కాపాడుకోవడంలో విఫలమయ్యాడు, ట్రిస్టన్ స్టబ్స్ ఫోర్, సిక్సర్ కొట్టాడు. స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్‌కి దారితీసింది. ఈసారి స్టబ్స్, డేవిడ్ మిల్లర్ చెలరేగారు. 23 పరుగులు చేశారు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ మూడు సిక్సర్లు కొట్టడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే, అతడు ఔట్ కావడంతో ఓటమి తప్పలేదు.
Also Read: భారత్‌ను అధిగమించిన పాకిస్థాన్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి.. కానీ..